NTV Telugu Site icon

Sajjanar Twitter Hacked : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

Sajjanar Twitter Hacked : ప్రముఖ సంస్థలు, సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్‌మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ సంస్థ ధృవీకరించింది. వరుస ట్విట్టర్ల హ్యాక్ లు కలకలం సృష్టిస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక.. ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ హ్యాండిల్ ను చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఓ వైపు ఆర్టీసీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు చూపు ఆర్టీసీపై పడింది.

Read Also: DR.Laxman: ఐదు లక్షల కోట్ల అప్పు.. ఏంటని ప్రశ్నిస్తే అరెస్టులు

అకౌంట్లను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. ట్విట్టర్ హ్యాండిల్‌ను మార్చారు. ఆర్టీసీ ఎండీ స్థానంలో ఫ్రాంక్లిన్‌ అని పేరు మార్చి డీపీలో కోతి ఎమోజీని ఉంచారు. హ్యాక్ చేసిన అనంతరం వరుస పోస్టులు కూడా చేశారు. హ్యాక్ అయిన సంగతి గుర్తించిన ఆర్టీసీ టెక్నికల్ టీమ్ అధికారులు రంగంలోకి దిగారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సజ్జనార్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురికావడం చాలా దురదృష్టకర సంఘటన అని టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. ప్రస్తుతం సదరు అకౌంట్‌ నుంచి ఎటువంటి ట్వీట్లను చేయడం కానీ రిప్లై ఇ‍వ్వడం కానీ జరగడం లేదని టీఎస్‌ఆర్టీసీ పీఆర్‌వో పేర్కొన్నారు. ట్విట్టర్‌ అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నామని , దీనికి ట్విట్టర్‌ సపోర్ట్‌ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Read Also: Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి