Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: ప్రచారంపై కాదు.. పథకాలు అందించే విషయంపైనే సీఎం జగన్ ఫోకస్ పెట్టారు!

Ys Jagan

Ys Jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రచారం గురించి ఇప్పుడే పట్టించుకోవటం లేదని, ప్రజలకు పథకాలు అందించే విషయం పైనే ఫోకస్ పెట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఎవరి ఊహకు కూడా అందని విషయమని, గతంలో ఇలాంటివి జరిగాయా? అని ప్రశ్నించారు. సీఎం వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చారని, పారదర్శకంగా పథకాలు అందుతున్నాయన్నారు. 2024 ఎన్నికలకు జనవరి 27 నుంచి భీమిలి నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు అని సజ్జల తెలిపారు.

విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… ‘2024 ఎన్నికలకు ఈ నెల 27 నుంచి భీమిలి నుంచి ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రజాస్వామ్యంలో పాలకుల బాధ్యత ఎలా ఉండాలి? అని కొత్త గేమ్ రూల్స్ రూపొందించారు. క్యాడర్‌తో మహాసభ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే అంటే పవర్ కాదు.. వైసీపీలో ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యత. వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కార్యకర్తలే. ఒకే ఒక్క నాయకుడు జగన్’ అని అన్నారు.

Also Read: Merugu Nagarjuna: సీఎం జగన్‌ను వదిలిపెట్టి వెళ్లే వారితో ఏం నష్టం జరగదు: మంత్రి మేరుగ

‘మల్లాది విష్ణు మరింత ఉన్నతమైన బాధ్యతల్లోకి వెళతారు. విజయవాడలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ కలిసికట్టుగా పని చేస్తూ వచ్చారు. మల్లాది పార్లమెంటు పరిధిలో కేశినేని నానితో కలిసి పని చేస్తారు. విష్ణు సారధ్యంలో వెల్లంపల్లి కలిసి పని చేస్తారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడు. కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు విలువైనవి. నాని వ్యాఖ్యలు ఒక సర్టిఫికెట్ లాంటిది. జగన్ ప్రచారం గురించి పట్టించుకోవటం లేదు. పథకాలు అందరికీ అందించే విషయంపైనే ఫోకస్ పెట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా తుఫాన్ వచ్చినా.. రెండు రోజుల్లో పంట నష్టం అంచనా వేయగలుగుతున్నాం. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఎవరి ఊహకు కూడా అందని విషయం. గతంలో ఇలాంటివి జరిగాయా?. సీఎం వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చారు. పారదర్శకంగా పథకాలు అందుతున్నాయి. డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో రానుంది’ అని సజ్జల చెప్పారు.

Exit mobile version