Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు వాయిస్ ను బీజేపీ నుంచి పురంధరేశ్వరి వినిపిస్తుంది..

Sajjala

Sajjala

ఎన్నికల సమయంలో చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు ఎందుకు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చేసే వాళ్ళం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి ఉండే వాళ్ళం.. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. చంద్రబాబు పాలన అంతా కుంభకోణాలమయం అని ఆయన విమర్శించారు. లిక్కర్ స్కాం లో ఫైనాన్స్ శాఖ, క్యాబినెట్ నిర్ణయానికి సంబంధం లేకుండా ప్రివిలేజ్ ఫీజు ఎత్తేశారు.. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు 1300 కోట్ల నష్టం జరిగింది.. రూ. 1300 కోట్ల నష్టం జరిగే నిర్ణయం ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా జరిగింది అంటే ఎలా?.. చంద్రబాబును విచారించకుండా ఎలా ఉంటాం? అని సజ్జల అన్నారు.

Read Also: Iran: డ్రగ్ రిహాబ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 32 మంది దుర్మరణం..

2015 నుంచి చంద్రబాబు అవినీతిలో విజృంభించారు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పుడేం ఉరి తీయటం లేదు కదా.. తప్పు జరగలేదని కోర్టులో తేలితే అది వేరే విషయం.. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కనుకే కేసు నమోదు అవుతున్నాయి.. రాత్రికి రాత్రి కేసులు పెట్టరు అని ఆయన తెలిపారు. ప్రాథమిక ఆధారాల కోసం విచారణ చేయకుండా కేసు ఎందుకు నమోదు చేస్తారో.. పురంధరేశ్వరి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు స్పష్టత ఉంది..
చంద్రబాబు వాయిస్ ను బీజేపీ నుంచి ఆమె వినిపిస్తున్నారు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version