Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: వివేకా కేసులో విచారణ పేరుతో హై డ్రామా

Sajjala

Sajjala

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి చేస్తోందన్నారు. కేసు ముగింపుకు వచ్చినట్లు చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.సీబీఐ వాడుతున్న పదాలు, వాడుతున్న మాటలు చూస్తే టీడీపీ రాజకీయ అజెండా అర్ధం అవుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని కల్పిత కథను నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు.

చంద్రబాబును అర్జెంటుగా అధికారంలో కూర్చోబెట్టాలన్నది వీళ్ళ ప్రయత్నం.హత్య చేసిన నిందితుడు తాను ఎంత కర్కశంగా హత్య చేశాడో చెప్పాడు.రాజకీయంగా ఇది టీడీపీ దివాళాకోరుతనం. తాము ఏం చేశామో చెప్పుకోవటానికి టీడీపీ కి ఏమీ లేదు. అందుకే జగన్ వ్యక్తిత్వహననానికి చంద్రబాబు పాల్పడుతున్నారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పై కూడా ఇలానే చేశారు. వివేకా కేసును ఎజెండాలో భాగంగానే టీడీపీ వాడుకుంటుందివిచారణ పేరుతో ఒక డ్రామా జరుగుతోంది. రాంసింగ్ ఏకపక్షంగా విచారణ చేశారు.

Read Also:Sajjala Ramakrishna Reddy Live: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రెస్ మీట్

అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి పైనే నేరారోపణ చేయాలని ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చారు. సుప్రీంకోర్టు మా అభ్యంతరం నిజమైందని నమ్మటం వల్లనే రాంసింగ్ ను విచారణ అధికారి పాత్ర నుంచి తప్పించారు. అంతకు ముందు లేని భాస్కర్ రెడ్డి ఇప్పుడు నిందితుడు ఎలా అయ్యాడు?అవినాష్ రెడ్డి సహ నిందితుడు ఎలా అయ్యాడు? ఏ ఆధారాలతో వీళ్ళను నిందితుల జాబితాలో చేర్చారో సీబీఐ ఎందుకు చెప్పటం లేదు?? మాకు నమ్మకం ఉంది నిజం బయటకు వస్తుందని. న్యాయస్థానంలో ఈ కేసు నిలబడదు అని అభిప్రాయపడ్డారు సజ్జల.

Read Also:Relief For Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. 25వరకూ అరెస్ట్ వద్దన్న హైకోర్ట్

హత్య చేసిన వ్యక్తిని అప్రూవర్ గా ఎలా మారుస్తారు??వాచ్ మ్యాన్ ప్రత్యక్ష సాక్షి గా వివరాలు చెప్పిన తర్వాత అప్రూవర్ అవసరం ఏం వచ్చింది??ఏ దర్యాప్తు సంస్థ ఇలా చేయదు.తానే హత్య చేశానని దస్తగిరి చెప్పిన తర్వాత ముందస్తు బెయిల్ కు సీబీఐ ఎలా ఒప్పుకుంది??దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయటం లేదు??ఇది ఒప్పందంలో భాగం కాదా?? అని సజ్జల ప్రశ్నించారు.

సీబీఐ అన్యాయమైన విచారణ చేస్తోంది. చంద్రబాబువి చంఢాలమైన, దరిద్రమైన, క్షుద్ర ఆలోచనలు.. దస్తగిరి స్టేట్ మెంట్ లో రాత్రి ఒకటిన్నర, రెండు గంటల సమయంలో సునీల్ యాదవ్ వాళ్ళు వివేకా ఇంట్లో జొరబడ్డారని ఉంది.సీబీఐ గూగుల్ టేక్ అవుట్ లో ఆ సమయంలో వీళ్ళంతా అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని చెబుతున్నారు. విరుద్ధమైన వాదనలు కాదా?ఆది నారాయణ గుండె పోటు అని ఎందుకు చెప్పాడో ఎందుకు విచారణ చేయటం లేదు?
లోతుగా విచారణ జరగాలి. అన్ని కోణాల్లో విచారణ చేయాలి.

జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సీబీఐ ఏ విధంగా పక్షపాత ధోరణితో విచారణ చేస్తుంది అనటానికి ఈ కేసు ఒక కేస్ స్టడీనే. చంద్రబాబు ఏం స్థాయిలో కుట్రలు పన్నగలడో అనటానికి ఈ కేసు ఒక ఉదాహరణ.ప్రజా కోర్టులో మాత్రం చంద్రబాబు దోషిగా నిలబడతాడు. విజయ్ కుమార్ స్వామి వాళ్ళ ప్రైవేటు ఫంక్షన్ కోసం విజయవాడ వచ్చారు. విజయవాడ వస్తున్నారు కనుక ఆశీర్వాదం ఇవ్వాలని సుబ్బారెడ్డి కోరారు. స్వామి ద్వారా న్యాయ వ్యవస్థ ను మేనేజ్ చేస్తున్నాం అంటున్నారు. అంటే న్యాయ వ్యవస్థ మేనేజ్ అవుతాయని చెబుతున్నారా??సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వివాదంలోకి లాగటం దారుణం కాదా?? అన్నారు సజ్జల.

Exit mobile version