NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: జగన్ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర.. గుంట నక్కలు వస్తున్నాయి జాగ్రత్త..!

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర.. ఎన్నికలు వస్తున్నాయి అనగానే గుంట నక్కలు పగటి వేషాలు వేసుకొని వస్తున్నాయి.. ప్రజలను భ్రమల్లో పెట్టి మళ్ళీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నాయి.. అంతా అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్త అని హెచ్చరించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో నాలుగేళ్ళ సంబరాలు జరిగాయి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు సజ్జల.. ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి నాలుగేళ్లు.. మే 30, 2019న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేశారు.. ఈ నాలుగేళ్ల పాలన ఒక చరిత్రగా అభివర్ణించారు.

Read Also: MS Dhoni: దటీజ్ ధోనీ.. మిస్టర్ కూల్ స్ట్రాటజీలే వేరప్ప.. మెరుపు కంటే వేగం..!

రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు సజ్జల.. 50 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులకు తెలుసు ప్రభుత్వం ఆ యా వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారోనని అన్నారు.. 2014-19 మధ్య చంద్రబాబు ఏం చేశాడు? చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నా అడ్డుకుంటున్నారు.. తాను ఏం చేయలేదు కనుకే చెప్పుకోలేక పోతున్నాడని సెటైర్లు వేశారు. అమ్మ ఒడి ఇస్తానంటాడు.. పక్క రాష్ట్రాల్లోని పథకాలు చెబుతున్నాడు.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో వెన్నుపోట్లు, పక్క పోట్లు అన్నీ ఉంటాయి.. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఒక్కటిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మనకు మంచి అవకాశం ఇచ్చారు.. గుంట నక్కల వ్యవహారాలను ప్రజలకు వివరించండి.. 175 కు 175 వచ్చేటట్లు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.