Site icon NTV Telugu

Saiyami Kher: ఏడాదిలో రెండు సార్లు.. తొలి భారతీయ నటిగా ‘సయామీ ఖేర్’ చరిత్ర!

Saiyami Kher Record

Saiyami Kher Record

బాలీవుడ్‌ నటి సయామీ ఖేర్‌ చరిత్ర సృష్టించారు. ఏడాదిలో రెండు సార్లు ‘ఐరన్‌ మ్యాన్‌ 70.3 ట్రయథ్లాన్‌’ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డుల్లో నిలిచారు. జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో సయామి తన రెండవ ఐరన్‌ మ్యాన్ 70.3ను విజయవంతంగా పూర్తి చేశారు. మొదటిసారి సెప్టెంబర్ 2024లో ట్రయథ్లాన్‌ను కంప్లీట్ చేశారు. దీనిని యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం సయామీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read: Bhadrachalam Temple: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి!

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేస్‌గా ‘ఐరన్‌ మ్యాన్‌ 70.3 ట్రయథ్లాన్‌’ గుర్తింపు పొందింది. ఈ రేస్‌ శారీరక సామర్థ్యం, సహనానికి పెను పరీక్ష. వరల్డ్‌ ట్రయథ్లాన్‌ కార్పొరేషన్‌ (డబ్ల్యూటీసీ) ఐరన్‌ మ్యాన్‌ ట్రయథ్లాన్‌ నిర్వహిస్తుంది. ట్రయథ్లాన్‌లో 1.9 కిమీ ఈత, 90 కిమీ సైక్లింగ్, 21.1 కిమీ పరుగు భాగంగా ఉంటాయి. ఐరన్‌ మ్యాన్‌ 70.3 ట్రయథ్లాన్‌ తన చిరకాల స్వప్నం అని సయామీ ఖేర్‌ చెప్పిన విషయం తెలిసిందే. సయామీ తన మొదటి రేసు కంటే 32 నిమిషాల ముందే రెండవ రేస్‌ను పూర్తి చేశారు. ఈ రేస్‌కు సంబందించిన కొన్ని పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.

Exit mobile version