Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు
- మరో ఇద్దరు పోలీసుల కోసం సిట్ గాలింపు
- సీఐ స్నేహితుడు సురేష్ కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. మృతదేహాన్ని మాయం చేసే కుట్రలో మరో ముగ్గురు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని.. సీఐ స్నేహితుడు సురేష్‌లు సీఐ నాగరాజుతో కలిసి సాయికృష్ణ మృతదేహాన్ని తరలించడం, ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించినట్లు సిట్ గుర్తించింది.
సీఐ నాగరాజు అరెస్ట్ అనంతరం హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అశోక్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు. సీఐ నాగరాజుకు అశోక్ అసిస్టెంట్‌గా పనిచేసినట్లు, అలాగే హెడ్ కానిస్టేబుల్ జంగం నాని సీఐ పేరు చెప్పుకుని పలు వ్యక్తిగత వ్యవహారాలు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. గతంలో గన్నవరం పోలీస్ స్టేషన్లో సస్పెన్షన్‌కు గురైన నాని.. అనంతరం పటమట పోలీస్ స్టేషన్లో కూడా అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు పంపినట్లు సమాచారం. ఇటీవలే ఆయనకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
సిట్ దర్యాప్తులో భాగంగా గత నెల 29న సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ను సెటిల్మెంట్ పేరుతో వడ్డేశ్వరానికి తీసుకెళ్లేందుకు సురేష్, అశోక్, నాని వెళ్లినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నవరంగ్ స్వయంగా సిట్ అధికారులకు చెప్పారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కాల్ డీటెయిల్ రికార్డులు (సీడీఆర్), సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ముగ్గురు పోలీసు సిబ్బంది కేసులో కీలక పాత్ర పోషించినట్లు సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్, నాని, సురేష్‌ల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఈ ఆరోపణలపై తుది నిర్ణయం దర్యాప్తు పూర్తయ్యాక, చట్టపరమైన ప్రక్రియ అనంతరం మాత్రమే స్పష్టత రానుంది. ప్రస్తుతం సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తోంది.
- Tags
- CI Nagaraju
- Saikrishna
- SIT
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!