Saif Ali Khan Attack : సైఫ్ అలీ ఖాన్ అభిమానులకు శుభవార్త. సైఫ్ అలీ ఖాన్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, వారం రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. లీలావతి హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ మాట్లాడుతూ.. సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రికి వచ్చినప్పుడు, అతని కుమారుడు తైమూర్ అలీ ఖాన్ అతనితో ఉన్నాడని చెప్పాడు. సైఫ్‌ను ఐసియు నుండి ప్రత్యేక వార్డుకు మార్చినట్లు డాక్టర్ చెప్పారు. సైఫ్ పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. బాగా కోలుకుంటున్నాడు. వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి.. సైఫ్ వెన్నెముకలో ఫ్లూయిడ్ లీకేజీని ఆపగలిగామన్నారు. పదునైన ఆయుధంతో సైఫ్ వెన్నెముకను దుండగుడు గాయపర్చాడు.. కానీ, వెన్నెముక డ్యామేజీ కాలేదు.. సైఫ్‌ను ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు మారుస్తున్నామన్నారు. తీవ్రమైన గాయం అయినప్పటికీ కుమారుడితో కలిసి సైఫ్ స్వయంగా ఆస్పత్రికి రావడం అభినందించదగ్గ విషయమన్నారు.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు.
లీలావతి హాస్పిటల్ డాక్టర్ నీరజ్ ఉత్తమని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘సైఫ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు, నేను మొదటి గంటలోనే అతన్ని కలిశాను. అతను రక్తంతో తడిసిపోయాడు. కానీ అతను బాగానే నడుస్తున్నాడు. అతను తన కొడుకు తైమూర్ తో వచ్చాడు. సైఫ్ నిజమైన హీరో. సినిమాల్లో హీరోగా ఉండటం వేరే విషయం. కానీ మీకు ఇంట్లో దాడి జరిగి, మీరు ధైర్యంగా ప్రవర్తించి ఇలా ఆసుపత్రికి వస్తే, మీరు నిజమైన హీరో. సైఫ్ స్ట్రెచర్ కూడా అడగలేదు.’’ అన్నారు.
Read Also:Pushpa 2 Re Loaded : హమ్మయ్య.. ఆ లోటు తీరింది!
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. సైఫ్ ఫ్లాట్‌లోకి వచ్చిన నిందితుడు మొదట పనిమనిషి ఎలియమ్ ఫిలిప్స్‌పై కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఆమెను కట్టేసిన దుండగుడు కోటి రూపాయలు ఇస్తేనే ఆమెను విడిచిపెడతానని బెదిరించాడు. అక్కడికి చేరుకున్న సైఫ్ ధైర్యంగా అతడిని ఎదుర్కొన్నాడు. అతనిపై దాడి చేసిన దుండగుడు సైఫ్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి మెట్ల గుండా పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్‌ను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. కారు అందుబాటులో లేకపోవడంతో, అతన్ని ఆటోలో ఆసుపత్రికి తరలించారు.
సైఫ్ ఇంట్లో ఏం జరిగింది?
గురువారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఆ గుర్తు తెలియని వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో సైఫ్ గాయపడ్డాడు. సైఫ్ పై 6 సార్లు దాడి జరిగింది. కత్తి అతని వెన్నెముకలోకి చొచ్చుకుపోయింది. అందుకే అతనికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి వచ్చింది.
Read Also:Rachakonda CP: ర్యాపిడో, ఓలా, ఉబేర్ ద్వారా హెరాయిన్ డ్రగ్ సరఫరా..