Sai Pallavi on Ramayana: హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోలు రణబీర్ కపూర్, యశ్, హీరోయిన్లు సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొని సినిమాతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యశ్ మాట్లాడుతూ.. రాముడి పాత్రలో ఉండే సింప్లిసిటీ, కంట్రోల్‌ను పెర్ఫార్మ్ చేయడం అంత సులభం కాదన్నారు. రావణుడి పాత్రను ఎవరైనా చేయగలరేమో కానీ, రాముడి పాత్రను పోషించడం అంత ఈజీ కాదని చెప్పారు.
సినిమా హీరో రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. యశ్ నటించిన ‘కేజీఎఫ్’ చూశానని, అతను కేవలం సూపర్‌స్టార్ మాత్రమే కాదని అన్నారు. రైటింగ్, మేకింగ్‌పై కూడా యశ్‌కు మంచి అవగాహన ఉందని, ఆయనకు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉందని ప్రశంసించారు. అలాగే తన కెరీర్‌కు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో కీలకమని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. తన జర్నీ ఇక్కడే స్టార్ అయిందని, తన కలను నెరవేర్చిన ఇండస్ట్రీ ఇదేనని చెప్పారు. ‘రామాయణ’ వంటి గర్వించదగ్గ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రణబీర్ రాముడిగా అద్భుతంగా నటించారని రకుల్ ప్రశంసించారు. సీతగా సాయి పల్లవి ఎంతో ప్రశాంతంగా, సెటిల్డ్‌గా నటించారని అన్నారు. ఇక యశ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆయనకు డైలాగ్ కూడా అవసరం లేదని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అంత బలంగా ఉంటుందని చెప్పారు.
సీత పాత్రలో నటించిన లేడి మెగాస్టార్ సాయి పల్లవి మాట్లాడుతూ.. సీత పాత్ర పోషించడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పాత్ర ద్వారా ప్రశాంతంగా ఉండటం, ఆధ్యాత్మికంగా ఆలోచించడం వంటి విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె స్టేజిపై హిందీలో రాముడి భజన పాటను కూడా పాడారు. ఈ సినిమా కోసం తాము మూడేళ్లు పనిచేస్తే.. దర్శకుడు, నిర్మాత మాత్రం దాదాపు పదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయాణిస్తున్నారని తెలిపారు. సినిమా షూటింగ్ హిందీలో జరిగినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు సులభంగా అర్థం అవుతుందని ఆమె అన్నారు. తమ పాత్రలను పోషించే సమయంలో ఏ పుస్తకాలు చదవాలో కూడా చిత్ర బృందం సూచించిందని సాయి పల్లవి తెలిపారు. ఎన్టీ రామారావు నటించిన రామాయణాన్ని, ఇటీవల తెలుగులో వచ్చిన రామాయణానికి సంబంధించిన కంటెంట్‌ను కూడా చూశానని చెప్పారు.
నిర్మాత దిల్ రాజు ‘ఫిదా’ సినిమా నుంచి తనను ప్రోత్సహిస్తూ, మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రణబీర్ గురించి మాట్లాడుతూ.. తన తొలి రోజు షూట్లోనే ఇంటర్వెల్ సీన్ చేశామని సాయి పల్లవి తెలిపారు. అప్పట్లో తాను టెన్షన్ పడుతుంటే రణబీర్ ఎంతో కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నారని చెప్పారు. భిన్నమైన సంస్కృతి నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా రణబీర్ తనకు ఎంతో సహకరించారని తెలిపారు. ఇక యశ్ గురించి కూడా సాయి పల్లవి ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, తన మూలాలకు సంబంధించిన కథలను చెప్పాలనే తపన యశ్‌లో కనిపిస్తుందని అన్నారు. సాధారణంగా రావణుడి పాత్ర ప్రేక్షకులకు నచ్చకూడదు.. కానీ, యశ్ తన నటనతో ఆ పాత్రను కూడా ప్రేక్షకులకు నచ్చేలా చేస్తారని సాయి పల్లవి పేర్కొన్నారు.

