సాయిపల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. న్యాచురల్ బ్యూటీగా అందరిని ఆకట్టుకుంటుంది.. అంతేకాదు హీరోలతో పోటి పడి డ్యాన్స్ చేస్తుంది.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా మాస్ స్టెప్పులతో అదరగొట్టిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతుంది.. ఏక్‌దిన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. తన సొంత ప్రొడక్షన్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో ఈ సినిమా రూపోందుతుంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం జపాన్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది.. జపాన్‌లోని సప్పారో ప్రాంతంలో షూట్ చేశారు. జపాన్ షెడ్యూల్ తాజాగా పూర్తి చేసుకుంది. దీంతో టీమ్ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు.. ఈ సందర్బంగా సాయి పల్లవి మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది..
షారూఖ్ ఖాన్ చెయ్య చెయ్య పాటకి ఆమె డాన్సు చేయడం విశేషం. టీమ్ అందరిలోనూ ఒకే అమ్మాయి సాయిపల్లవి, కానీ ఊరమాస్ డాన్సుతో రెచ్చిపోయింది.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో వీడియో ట్రెండ్ అవుతుంది..తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది. కమల్ హాసన్ ప్రొడక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ఇలా సెలెక్టేడ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ అమ్మడు తెలుగు, తమిళ్లో కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..
Queen Sai Pallavi Dance at #EkDin japan schedule wraps up party 🥹♥️#SaiPallavi @Sai_Pallavi92 #Japan pic.twitter.com/j10iQTYQqd
— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 8, 2024