Sai Pallavi: తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తన సహజసిద్ధమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి. తనదైన నటనతో దక్షిణాదిని ఏలిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ వెండితెరపై మెరవడానికి సిద్ధం అవుతుంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’. తాజాగా ఈ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
READ ALSO: Cockfight Attack: కోడి పందెం గెలిచిన వ్యక్తిపై బ్లేడ్‌తో దాడి..
ఈ పోస్టర్ విడుదలైన కొద్దిసేపటికే నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు. 2016లో విడుదలైన థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’ పోస్టర్‌కు, సాయి పల్లవి కొత్త సినిమా ‘ఏక్ దిన్’ పోస్టర్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కేవలం పోస్టర్ మాత్రమే కాకుండా, సినిమా పేరు కూడా దాదాపు ‘వన్ డే’ సినిమా అర్థం వచ్చేలా ఉండటంతో.. ఇది ఆ చిత్రానికి అధికారిక రీమేక్ ఆ? లేకపోతే కాపీ కొట్టారా? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ‘అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్’ ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. సునీల్ పాండే డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ ‘ఏక్ దిన్’ మూవీపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న విమర్శలకు చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే.
READ ALSO: Stock Market: ఫర్ ది ఫస్ట్ టైం ఆదివారం ఓపెన్ కాబోతున్న స్టాక్ మార్కెట్.. రీజన్ ఇదే!
