న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు, తమిళ్, మలయాల ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ సాయి పల్లవి మాత్రం ప్రతి ఒక్క అభిమాని లిస్టులో క్రష్ గా మిగిలింది. ఇక తాజాగా ఈమె చెల్లి ఎంగేజ్మెంట్ పూజా ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.. ఆ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…
అక్క కన్నా ముందే పెళ్లి చేసుకోబోతుంది పూజా.. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాలంలో మన సినీ సెలబ్రిటీలు ధరించే దుస్తుల గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ తరుణంలోనే తాజాగా తన చెల్లిలి ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి కట్టుకున్న చీర ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో సింపుల్ లుక్ లో కనిపించిన సాయి పల్లవి.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది..
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆ ఎంగేజ్మెంట్ లో కూడా చాలా సింపుల్ గా అందంగా మెరిసింది.. ఇక సాయి పల్లవి తన చెల్లెలి ఎంగేజ్మెంట్ లో కట్టిన చీర ధర అక్షరాల 50 వేలు అట. ఇక ఈమె చీర ధర తెలుసుకున్న కొందరు ఆశ్చర్యపోతున్నారు కూడా. అంతేకాకుండా..’ చెల్లి కన్నా అక్కే అందంగా కనిపిస్తుంది.. ఎంతైనా సాయి పల్లవి అందమే అందం.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుసగా రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది..