Sai Pallavi comments on dance shows : డ్యాన్స్ షోలపై హీరోయిన్ సాయిపల్లవి సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi comments on dance shows : ఈ టీవీలో వచ్చిన ఢీ డ్యాన్స్ షోలో డ్యాన్సర్ గా ఫేమస్ అయిన మళయాళ బ్యూటీ సాయిపల్లవి అదే డ్యాన్స్ షోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యాన్స్ పోటీల్లో ప్రతిభకు చోటు లేదని, గౌరవం లేదని కేవలం డబ్బుంటేనే డ్యాన్స్ లో గౌరవం ఉంటుందని కామెంట్ చేశారు. సాయి పల్లవి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు బుల్లితెర మీద డ్యాన్స్ షోస్ చేసిన విషయం తెలిసిందే. 2008లో తమిళంలో స్టార్ విజయ్ ఛానల్ లో ‘ఉంగళిల్ యార్ అడుత ప్రభుదేవా?’ అనే డ్యాన్స్ షోలోనూ, 2009లో ఈటీవీలో ప్రసారమైన ఢీ4లో పాల్గొంది. ఈ షోస్ లో తనదైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళ డ్యాన్స్ షోలో అయితే ఫైనల్ వరకూ వెళ్లి రన్నర్ గా నిలిచింది. డ్యాన్స్ షోస్ ద్వారా వెలుగులోకి వచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత హీరోయిన్ గా స్థిరపడింది. దర్శకుల ఉత్తమ ఎంపికగా సాయి పల్లవి పేరు తెచ్చుకుంది. లేడీ పవర్ స్టార్ గా క్రేజ్ దక్కించుకుంది.
Read Also: Jawan: వివాదాల్లో షారూఖ్ ఖాన్.. కథ కాపీ అంటున్న నిర్మాత
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
సాయిపల్లవి ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. హీరోయిన్ అయినప్పటికీ డ్యాన్స్ విషయంలో హీరోలకి పోటీగా డ్యాన్స్ చేస్తుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి టీవీ డ్యాన్స్ రియాలిటీ షోస్ పై తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. టీవీ ఛానల్స్ లో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారని, ప్రముఖుల వారసులకే మర్యాద, గౌరవం దక్కుతాయని ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే తనకు డ్యాన్స్ రియాలిటీ షోస్ పై నమ్మకం లేదని, ఈ డ్యాన్స్ షోలు అంటే తనకు అసహ్యమని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. విన్నర్ అవ్వాల్సిన తనను ప్రముఖుల వారసుల కోసం తొక్కేశారన్న అభిప్రాయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!