Site icon NTV Telugu

Sai Madhav Burra: ‘కథను మానభంగం చేశారు’.. ఓ లేటెస్ట్ మూవీపై సాయి మాధవ్ బుర్ర సంచలన వ్యాఖ్యలు!

Sai Madhav Burra

Sai Madhav Burra

Sai Madhav Burra: ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సినిమా కథపై పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో.. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది.. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు.. కథని మానభంగం చేశారు.. నాది రివెంజ్ డ్రామా కాదు.. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’ అని రాసుకొచ్చారు. దీనిపై నెట్టిజన్లు విభిన్నంగా స్పందింస్తున్నారు. కొందరు రాసుకున్న కథను తెరపైకి అలాగే తీసుకురావాలంటే అదృష్టం ఉండాలని అంటే, మరికొందరు ఆ సినిమా రచయితే నిర్మాత కావాలని అంటున్నారు. మొత్తానికి ఆయన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది ఎస్. సరస్వతి సినిమా గురించే అనే చర్చ జరుగుతోంది.

READ ALSO: NTR-Neel: ‘డ్రాగన్’లో పవర్‌ఫుల్ పాత్రలో ఖుష్బూ? ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో అదిరిపోయే ట్విస్ట్!

నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారి చేసిన సినిమా ‘సరస్వతి’. స్వతహాగా తమిళ నటి అయినా, ఈ మధ్యకాలంలో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈ సినిమాని తెలుగులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గమనార్హం. రిలీజ్‌కి ఒక రోజు ముందు సెన్సార్ అభ్యంతరాలతో ‘ఎస్ సరస్వతి’గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ మొదటిసారి దర్శకత్వం చేస్తూ ఉండటం, ప్రమోషన్ కంటెంట్ వర్కౌట్ కావడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.

READ ALSO: David Reddy: ‘డేవిడ్ రెడ్డి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఉక్రెయిన్ భామ..

Exit mobile version