Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!

  • సాయి కృష్ణ కాస్టోడియల్ డెత్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
  • సాయి కృష్ణ కేసును సిబిఐ అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు...
Sai Krishna Custodial Death

Sai Krishna Custodial Death

Sai Krishna Custodial Death: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది.

విచారణ సందర్భంగా సాయికృష్ణ కేసును దర్యాప్తు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా అందించాలని స్పష్టం చేసింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. ఈ కేసులో దర్యాప్తు తీరు, ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం, సీసీటీవీ ఫుటేజ్‌కు సంబంధించిన అంశాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.