NTV Telugu Site icon

Sai Dharam Tej New Movie: సాయిధరమ్ కొత్త చిత్రం పూజతో ఆరంభం

Sai Dharam Tej

Sai Dharam Tej

Sai dharam tej New Movie: ‘రిపబ్లిక్’ తర్వాత బైక్ ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ తేరుకుని కొత్త సినిమా ఆరంభించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై జయంత్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ బి.వి.ఎస్. ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ పూజతో ఆరంభం అయింది. సాయిధరమ్ తేజ్ 16వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణలను ఎంపిక చేయాల్సి ఉంది.

MM Sreelekha: రాజమౌళితో విబేధాలు.. మా అన్నయ్యకు ఎవరిని ఉపయోగించుకోవాలో బాగా తెలుసు

బాపినీడు సమర్పణలో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో మొదలు పెడతామంటున్నారు దర్శకనిర్మాతలు. ఇదే సంస్థలో ఇంతకు ముందు సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేయగా… సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ ఏడాది ‘రంగ రంగ వైభవంగా’ అనే మూవీ చేయటం విశేషం.