Sai Dharam Tej: పవన్ కల్యాణ్‌తో లెగో బాండింగ్.. అలాంటి సినిమాలే చేస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జరిగిన గలాట్టా ప్లస్ మెగా ప్యాన్-ఇండియా రౌండ్ టేబుల్ లో సాయి ధరమ్ తేజ్, శృతి హాసన్, శ్రియా రెడ్డి, శోభు యార్లగడ్డ, తరుణ్ భాస్కర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన మాటలు సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తన జీవితంలో తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు తెచ్చుకున్నారు. జీవితం మిమ్మల్ని కిందకు నెట్టినా కూడా మళ్లీ పైకి లేపేందుకు మార్గం చూపుతుంది అని తేజు అన్నారు.. దానివల్ల చాలా కాలం సినిమాలకి దూరంగా ఉండి విరూపాక్ష తో విజయం సాధించడం బావుందా అని అడగగా, సినిమా సక్సెస్ కంటే యాక్సిడెంట్ తర్వాత తన జీవితం బావుంది అని అన్నారు. కోమా నుండి కోలుకున్నాక అభిమానుల నుండి వచ్చిన మెసేజెస్ చదవడం తనకి చాలా ఆనందాన్ని కలిగించింది అని ‘విరూపాక్ష’ సక్సెస్ కంటే ఆ సంతోషం ఎక్కువగా ఉంది అని అన్నారు. యాక్సిడెంట్ తర్వాత ఫ్యాన్స్ నుండి వచ్చిన ప్రేమే తనకు నిజమైన విజయం అని చెప్పారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అలాగే భారతీయ సినిమాలు, హాలీవుడ్ సినిమాల మధ్య తేడా గురించి చెబుతూ సాయి ధరమ్ తేజ్ భారతీయ సినిమాలలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని.. స్లో మోషన్ లో సీన్లు ఇండియా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతీయ సినిమాల్లో స్లో మోషన్ సన్నివేశాలు ప్రేక్షకులలో ఎమోషన్స్ పండిస్తాయని.. ముఖ్యంగా హీరోలకి ఎంట్రీ సీన్లు స్లో మోషన్ లో ఉండడం ద్వారా ఫాన్స్ కి విజిలెసే అవకాశం దక్కుతుందని అన్నారు. ఇక మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ఆయనకి లెగో ఆడడమంటే చాలా ఇష్టమని.. తను ఎప్పుడన్నా తనకు లేదో కొనుక్కుంటే పవన్ కళ్యాణ్ ని కూడా ఒకటి కొనుక్కొని తీసుకెళ్లేవారని చెప్పారు. తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ, పవన్ కళ్యాణ్ తనను లెగో ఆడటానికి తరచుగా పిలిచేవారని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
శోభు యార్లగడ్డ ఫిల్మ్ ప్లానింగ్ టెక్నిక్ లు చాలా బాగుంటాయి అని ఆయనను ప్రశంసించారు సాయి ధరమ్ తేజ్. ప్లానింగ్ అనేది సినిమాకి చాలా ముఖ్యమని.. తన రిపబ్లిక్ సినిమా సమయంలో స్టోరీ బోర్డింగ్ మీ.. షాట్ డివిజన్ వంటి ప్లాంట్స్ వల్ల చాలా పనులు అనుకున్న సమయం కంటే సగం సమయంలో పూర్తి చేయడానికి సహాయపడ్డాయని చెప్పారు. కరోనా లాక్ డౌన్ తర్వాత మారుతున్న ప్రేక్షకుల అంచనాల గురించి చెప్తూ.. ప్రజలు అన్ని భాషల్లో సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నారు అని, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు అనే దాని కంటే ఎలాంటి సినిమాలు చేస్తున్నారు అనేది మాత్రమే చూస్తున్నారని పేర్కొన్నారు.
ఇక చివరగా.. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ వంటి బోల్డ్ స్క్రిప్ట్‌ను తనకు చెప్పుంటే తాను హీరోగా చేయడానికి ఒప్పుకో ఉంటారా అని అడగగా, సాయి ధరమ్ తేజ్ అలాంటి ఛాలెంజింగ్ పాత్రల పట్ల ఆసక్తి వ్యక్తం చేశాడు. అలాంటి ఒక బోల్డ్ పాత్రను చేయడం లో తనకి ఆసక్తి ఉంది అన్న తేజ్ అలాంటి పాత్రలను పోషించడానికి ధైర్యం చేసిన రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న వంటి నటులపై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చాడు. ఈ విధంగా గలాట్టా ప్లస్ మెగా ప్యాన్-ఇండియా రౌండ్ టేబుల్ 2023 సందర్భంగా సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత.. తన సినీ జీవితం గురించి ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకున్నారు. భవిష్యత్తులో ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి రెడీ అని కూడా ఓపెన్ గా చెప్పారు సాయి ధరమ్ తేజ్. ఇక ఆయన ఈ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!