Sai Dharam Tej: ఇది నా రెండో జన్మ.. అందరు దాన్ని మర్చిపోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej:నేటి యువతతో పాటు అందరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్నెస్తో వుండాలని సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సాయిధరమ్ తేజ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తనకు ఇది రెండో జీవితం. ప్రమాదం నుంచి బయపడటానికి హెల్మెట్ కారణమైంది. అభిమానులు, మీలాంటి వాళ్లు, ప్రేక్షకుల ఆశ్సీస్సులతో ఈ రోజు మీ ముందు ఇలా నిలబడ్డానికి కారణమని చెప్పా. తప్పకుండా టూవీలర్ డ్రైవ్ చేసే వాళ్లంతా హెల్మెట్‌ను తప్పక ధరించాలని, కార్లు డ్రైవ్ చేసే వారు సీటు బెల్డ్‌లు విధిగా ధరించాలని కోరుకుంటున్నాను.
చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో నిర్లక్ష్యంగా వుంటున్నారు. డ్రైవింగ్‌లో వున్నప్పుడు సేఫ్టీని మర్చిపోతున్నారు. తప్పకుండా అందరూ ట్రాఫిక్స్ రూల్స్ పాటించాలని కోరుతున్నాను. అలాగే మద్యం తాగినప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకకరం. అందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ, ట్రాఫిక్స్ నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డితో పాటు ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక తేజ్ సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం గాంజా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాతో తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!