NTV Telugu Site icon

Sai Dharam Tej: ఇది నా రెండో జన్మ.. అందరు దాన్ని మర్చిపోతున్నారు

Sai

Sai

Sai Dharam Tej:నేటి యువ‌త‌తో పాటు అంద‌రూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాల‌ని, రోడ్డు ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా అవేర్‌నెస్‌తో వుండాల‌ని సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌ చెప్పుకొచ్చాడు. జాతీయ రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్‌) ఆధ్వ‌ర్యంలో బంజ‌రాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేష‌న‌ల్ సోసైటీ ఆడిటోరియంలో ర‌హ‌దారి భ‌ద్ర‌తా చైత‌న్య స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథిగా సాయిధ‌ర‌మ్ తేజ్‌ హాజరయ్యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..” రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న త‌న‌కు ఇది రెండో జీవితం. ప్ర‌మాదం నుంచి బ‌య‌ప‌డ‌టానికి హెల్మెట్ కార‌ణమైంది. అభిమానులు, మీలాంటి వాళ్లు, ప్రేక్ష‌కుల ఆశ్సీస్సుల‌తో ఈ రోజు మీ ముందు ఇలా నిల‌బ‌డ్డానికి కార‌ణ‌మ‌ని చెప్పా. త‌ప్ప‌కుండా టూవీల‌ర్ డ్రైవ్ చేసే వాళ్లంతా హెల్మెట్‌ను త‌ప్ప‌క ధ‌రించాల‌ని, కార్లు డ్రైవ్ చేసే వారు సీటు బెల్డ్‌లు విధిగా ధ‌రించాల‌ని కోరుకుంటున్నాను.

చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించ‌డంలో నిర్ల‌క్ష్యంగా వుంటున్నారు. డ్రైవింగ్‌లో వున్న‌ప్పుడు సేఫ్టీని మర్చిపోతున్నారు. త‌ప్ప‌కుండా అంద‌రూ ట్రాఫిక్స్ రూల్స్ పాటించాల‌ని కోరుతున్నాను. అలాగే మ‌ద్యం తాగిన‌ప్పుడు డ్రైవింగ్ చేయ‌డం చాలా ప్ర‌మాద‌కకరం. అంద‌రూ ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రిస్తూ, ట్రాఫిక్స్ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరుకుంటున్నాను. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హైద‌ర‌బాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ కొత్త‌కోట శ్రీ‌నివాస రెడ్డితో పాటు ట్రాఫిక్ అద‌న‌పు పోలీసు క‌మిష‌న‌ర్ విశ్వ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇక తేజ్ సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం గాంజా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాతో తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.