Sai Dharam Tej: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులు గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
Federal Reserve Rate Cut: ఉపాధి ఆందోళనల మధ్య ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత.. ఎంతంటే?
సక్సెస్ మీట్ లో హీరో సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ సాహుతో నాకు మంచి ఒక అనుబంధం ఉంది. సాహు తమ్ముడు డిగ్రీలో నా క్లాస్ మేట్. ఆ బాండ్ అప్పటినుంచి ఉంది. సాయితో నాకు ముంబైలో యాక్టింగ్ క్లాస్ నుంచి పరిచయం ఉంది. 15 ఏళ్లుగా మా జర్నీ కొనసాగుతోంది. ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్ళం. ఈ స్టేజ్ నాకు ఒక రియూనియన్ లాగా ఉంది. నా టెన్త్ క్లాసు మేట్ వశిష్ట, కనిష్క కూడా నా క్లాస్ మేట్. అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అనిల్ నాకు ఎంతో సన్నిహితులు. మా మావయ్యతో చేస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సక్సెస్ మీట్ లో అందరూ నవ్వుకోవడం కూడా ఒక పెద్ద సక్సెస్. ఈ మూమెంట్ ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మొత్తం ఇండస్ట్రీ సక్సెస్ లాగా భావిస్తున్నా.
BJP: రాహుల్ గాంధీ సొంత దేశంపైనే అణుబాంబు, హైడ్రోజన్ బాంబు వేస్తున్నాడు.
ఇండస్ట్రీ ఒక ఎవల్యూషన్ దశలో ఉంది. మంచి కథలు రావాలి. ఆడియన్స్ ని ఎక్సయిట్ చేసే కథలు రావాలి. అలా వస్తేనే ఆడియన్స్ కి వస్తారు. అలాంటి సినిమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిస్కింధపురి.. ఇలా అన్ని సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. మంచి కంటెంట్ ని ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత మంచి హిట్ అందుకున్న కిస్కింధపురి టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్ అని అన్నారు.
