Site icon NTV Telugu

Sai Abhyankkar : ఫస్ట్ సినిమాతోనే రికార్డు కొల్లగొట్టిన సాయి అభ్యంకర్

Sai Abhyankar

Sai Abhyankar

నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. జస్ట్ ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనే ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్‌గా మారిపోయాడు. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. తను కంపోజ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్, మాలీవుడ్ మూవీ బాల్టీ ఈ శుక్రవారమే రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మ్యూజిక్ అండ్ బీజీఎంకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ మూవీ కోసం అభ్యంకర్‌ రూ. 2 కోట్లు చార్జ్ చేశాడు.

Also Read : Sai Pallavi : కోలీవుడ్‌కు దూరంగా సాయి పల్లవి.. కారణం ఏంటి?

సాయి అభ్యంకర్‌కు రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్‌ ఇచ్చినట్లు బాల్టీ ప్రొడ్యూసర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సాయికి ఉన్న క్రేజ్, డిమాండ్ బట్టే అంత అమౌంట్‌ ఇచ్చామని క్లారిటీ ఇచ్చాడు. తమ సినిమా కమిట్ అవ్వడానికి ముందే అతడి చేతిలో పది సినిమాలు ఉన్నాయన్నారు. అయితే మాలీవుడ్‌లో ఇది రికార్డ్ రెమ్యునరేషన్. ఇప్పటి వరకు మాలీవుడ్‌లో ఏ కంపోజర్ ఇంత రెమ్యునరేషన్‌ తీసుకోలేదని తెలుస్తోంది. పేరెంట్స్ టిప్పు, హరిణి సెలబ్రిటీలైనా, తన టాలెంట్‌తోనే గుర్తింపు తెచ్చకున్నాడు సాయి అభ్యంకర్. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో మ్యూజిక్ సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే ఈ యంగ్ కంపోజర్‌కి మొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్- అట్లీ భారీ బడ్జెట్ ఫిల్మ్‪కు బాణీలు సమకూర్చే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నాడు. ఇవే కాకుండా తమిళంలో డ్యూడ్, కరుప్పు, బెంజ్, శింబు49 , మార్షల్ చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ రెమ్యునరేషన్ , ప్రాజెక్ట్స్‌ చూస్తుంటే స్టార్ కంపోజర్స్ అనిరుధ్, తమన్, దేవీలకు గట్టి పోటీ ఇచ్చేట్లే కనిపిస్తున్నాడు.

Exit mobile version