Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఓ వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను బ్లేడుతో కోసుకున్నాడు. అనంతరం అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నాగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందింది. తమ్ముడు, ఆయన భార్య చేస్తున్న ఆరోపణలతో ఆ వ్యక్తి మనస్తాపానికి గురయ్యాడు. అందుకే ఈ చర్య తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఇంటి నుండి అరుపుల శబ్దాలు వచ్చాయి. చుట్టుపక్కల వారికి అనుమానం రావడంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. ఓ వ్యక్తి ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. నేలంతా కూడా రక్తంతో ఎర్రగా ఉంది. వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా ఉంది. వెంటనే చుట్టుపక్కల వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి చికిత్స కొనసాగుతోంది.
Read Also:India: కెనడా- పాకిస్తాన్లలో దేవాలయాలు, గురుద్వారాలపై దాడులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 58 ఏళ్ల వ్యక్తి తాను అవివాహితుడిని అని చెబుతున్నాడు. తన తమ్ముడు, అతని భార్య ఎప్పుడూ తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించాడు. తమ్ముడి భార్యను వేధించేవాడని చెబుతున్నారు. ఈ కారణంగా వారి ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. గురువారం కూడా ఇదే విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. విషయం కొట్లాట దాకా చేరింది. ఆ తర్వాత కంగారుపడి తన గదిలోకి వెళ్లాడు. తన ప్రైవేట్ పార్ట్ ను బ్లేడుతో కోసుకున్నాడు. అయితే ఆమె కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చారు. వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. జననాంగాలు కోసుకోవడం వల్ల ఆ వ్యక్తి చాలా రక్తాన్ని పోగొట్టుకున్నాడు. దీంతో అతడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో ఇంకా వ్రాతపూర్వక ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు. అయినా పోలీసులు ఒక్కో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి కూడా కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
Read Also:Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ కు ఏడాది పూర్తి.. నేడు ఆదిలాబాద్ కు భట్టి విక్రమార్క..!
