Arjun Tendulkar Wedding: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. పలు నివేదికల ప్రకారం.. ఇప్పటికే వీరి పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఆగస్టు 2025లో అతి కొద్ది మంది సమక్షంలో ఈ ఇరువురు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంతకీ వీరి పెళ్లికి ముహూర్తం ఎప్పుడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Road Accident: శబరిమల యాత్రికుల వాహనానికి ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి..
పలు నివేదికల ప్రకారం.. అర్జున్ – సానియా చందోక్ వివాహం మార్చి 5, 2026 న జరగనుంది. వివాహానికి ముందు వేడుకలు మార్చి 3 న ప్రారంభమవుతాయి. సానియా విషయానికి వస్తే ఆమె ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. అలాగే ఆమెకు సొంతంగా పెంపుడు జంతువుల సంరక్షణ బ్రాండ్ కూడా ఉంది. సానియా ఫ్యామిలీకి – టెండూల్కర్ కుటుంబానికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అర్జున్-సానియాల వివాహ వేడుకలు ముంబైలోనే జరుగుతాయని, ఈ వేడుకలకు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రికెట్ ప్రపంచం నుంచి కొంతమంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుందని ఈ నివేదికలు పేర్కొన్నాయి.
ఇకపోతే అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. తను ఇటీవలే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన సంగతి తెలిసిందే. 2026 సంవత్సరం అర్జున్‌కు తన కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో కూడా చిరస్మరణీయమైనదిగా ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ కొత్త సీజన్‌కు ఒక పక్క సన్నద్ధమవుతూనే, పెళ్లి వేడుకలకు కూడా రడీ అవుతున్నారు చెబుతున్నారు.
READ ALSO: F&O Trading Loss: రూ.2.85 లక్షల జీతగాడు.. రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు! ఎలాగో చూడండి..
