Sachin Tendulkar: బౌలింగ్‌తో సచిన్‌ను మెప్పించిన 12 ఏళ్ల అమ్మాయి (వీడియో)
- సోషల్ మీడియాలో వైరల్ వీడియో
- తన బౌలింగ్‌తో సచిన్‌ను మెప్పించిన 12 ఏళ్ల అమ్మాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్ టెండుల్కర్ రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా గ్రామం రామేర్ తలాబ్‌కి చెందిన 12 ఏళ్ల సుశీలా మీనాను ప్రశంసించారు. ఆ చిన్నారి బౌలింగ్ యాక్షన్ జహీర్ ఖాన్‌ను గుర్తుకు తెస్తుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Road Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ప్రస్తుతం సుశీలా మీనా బౌలింగ్ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. సచిన్, జహీర్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ, “సరళమైన, సులభమైన, చూడటానికి ఎంతో మధురమైన యాక్షన్.. సుశీలా మీనా బౌలింగ్ యాక్షన్‌లో మీరే కనిపిస్తున్నారోమో, జహీర్ ఖాన్. మీరు ఇది చూసారా?” అని ట్వీట్ చేశారు. ఇకపోతే, సుశీలా మీనా ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి రతన్‌లాల్ మీనా, తల్లి శాంతి బాయి మీనా. వారు పనుల ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సాదారణమైనప్పటికీ, సుశీలా క్రికెట్ పట్ల ఆమె ఆసక్తిని కొనసాగిస్తోంది.
Smooth, effortless, and lovely to watch! Sushila Meena’s bowling action has shades of you, @ImZaheer.
Do you see it too? pic.twitter.com/yzfhntwXux— Sachin Tendulkar (@sachin_rt) December 20, 2024
Also Read: Samsung Galaxy S25: గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అదిరిపోయే మొబైల్స్‌ను విడుదల చేయనున్న సామ్సంగ్
సుశీలా బౌలింగ్ యాక్షన్ చూస్తే అచ్చం జహీర్ ఖాన్‌తో పోలికలున్నట్లు తెలుస్తోంది. ఆమె బౌలింగ్ స్లో-మోషన్ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు, ఆమెను ‘లేడీ జహీర్ ఖాన్’గా పోలుస్తున్నారు. సుశీలా స్కూల్ స్థాయిలో క్రికెట్ పోటీల్లో పాల్గొంటోంది. ఆమె టాలెంట్ గురించి తెలుసుకున్న ప్రజలు, ఆమెను ఇండియన్ వుమెన్ క్రికెట్ టీమ్‌లో భవిష్యత్ స్టార్‌గా అభివృద్ధి చెందుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ చిన్నారి టాలెంట్ సచిన్ వంటి దిగ్గజ క్రికెటర్ ద్వారా గుర్తింపు పొందటంతో గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!