NTV Telugu Site icon

Sachin Tendulkar: తన బౌలింగ్‌తో సచిన్‌ను మెప్పించిన 12 ఏళ్ల అమ్మాయి (వీడియో)

Sachin

Sachin

Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్ టెండుల్కర్ రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా గ్రామం రామేర్ తలాబ్‌కి చెందిన 12 ఏళ్ల సుశీలా మీనాను ప్రశంసించారు. ఆ చిన్నారి బౌలింగ్ యాక్షన్ జహీర్ ఖాన్‌ను గుర్తుకు తెస్తుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Road Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్

ప్రస్తుతం సుశీలా మీనా బౌలింగ్ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. సచిన్, జహీర్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ, “సరళమైన, సులభమైన, చూడటానికి ఎంతో మధురమైన యాక్షన్.. సుశీలా మీనా బౌలింగ్ యాక్షన్‌లో మీరే కనిపిస్తున్నారోమో, జహీర్ ఖాన్. మీరు ఇది చూసారా?” అని ట్వీట్ చేశారు. ఇకపోతే, సుశీలా మీనా ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి రతన్‌లాల్ మీనా, తల్లి శాంతి బాయి మీనా. వారు పనుల ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సాదారణమైనప్పటికీ, సుశీలా క్రికెట్ పట్ల ఆమె ఆసక్తిని కొనసాగిస్తోంది.


Also Read: Samsung Galaxy S25: గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అదిరిపోయే మొబైల్స్‌ను విడుదల చేయనున్న సామ్‌సంగ్

సుశీలా బౌలింగ్ యాక్షన్ చూస్తే అచ్చం జహీర్ ఖాన్‌తో పోలికలున్నట్లు తెలుస్తోంది. ఆమె బౌలింగ్ స్లో-మోషన్ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు, ఆమెను ‘లేడీ జహీర్ ఖాన్’గా పోలుస్తున్నారు. సుశీలా స్కూల్ స్థాయిలో క్రికెట్ పోటీల్లో పాల్గొంటోంది. ఆమె టాలెంట్ గురించి తెలుసుకున్న ప్రజలు, ఆమెను ఇండియన్ వుమెన్ క్రికెట్ టీమ్‌లో భవిష్యత్ స్టార్‌గా అభివృద్ధి చెందుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ చిన్నారి టాలెంట్ సచిన్ వంటి దిగ్గజ క్రికెటర్ ద్వారా గుర్తింపు పొందటంతో గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

Show comments