క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ , దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో కలిసి ఓ హృదయపూర్వక ఇంటర్వ్యూ జరిగింది. వారి సమావేశం గురించి టెండూల్కర్ వారి మరపురాని సంభాషణ వివరాలను అలాగే వారు కలిసి గడిపిన సమయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. వారిద్దరి కలిసి దిగిన ఫోటోను తాజాగా సచిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇక తన పోస్ట్లో., గత ఆదివారం చిరస్మరణీయమైనది, ఎందుకంటే మిస్టర్ టాటాతో సమయం గడిపే అవకాశం నాకు లభించింది. ఆటోమొబైల్స్ పట్ల మా పరస్పర ప్రేమ, సమాజానికి తిరిగి ఇవ్వాలనే మా నిబద్ధత, వన్యప్రాణుల సంరక్షణ పట్ల మక్కువ అలాగే మా స్నేహితుల పట్ల ఆప్యాయత గురించి కథలు, అంతర్దృష్టులను పంచుకున్నామని వ్రాసుకొచ్చాడు.
Bangladesh MP: కోల్‌కతాలో బంగ్లాదేశ్ ఎంపీ మిస్సింగ్.. హత్యకు గురైనట్లు పోలీసుల అనుమానం..
సంభాషణల విలువను నొక్కిచెప్పిన టెండూల్కర్, ఇలాంటి సంభాషణలు అమూల్యమైనవి, అలాగే మన అభిరుచులు మన జీవితాలపై చూపే ఆనందం, ప్రభావాన్ని గుర్తు చేస్తాయని పేర్కొన్నాడు. ఈ రోజును నేను చిరునవ్వుతో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సచిన్ అన్నారు. ఇక సచిన్ పంచుకున్న పోస్ట్ లోని చిత్రంలో.. కుర్చీలో కూర్చున్న రతన్ టాటా పక్కన టెండూల్కర్ నిలబడి ఉన్నాడు. భారతదేశంలోని అత్యంత గౌరవనీయులైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ హృదయపూర్వక పరస్పర చర్య చాలా మందికి చేరువైంది.
Cashew Benefits : జీడిపప్పులను తేనెలో నానబెట్టి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కార్లు, వన్యప్రాణుల సంరక్షణ పట్ల వారి ప్రేమ నుండి దాతృత్వ ప్రయత్నాలకు వారి అంకితభావం వరకు వివిధ అంశాలపై టెండూల్కర్, రతన్ టాటాల మధ్య చర్చ జరిగింది. ఇక 2024 లోక్సభ ఎన్నికల ఐదవ దశలో రతన్ టాటా ముంబై లోని కోలాబాలో ఓటు వేశారు.
A Memorable Conversation.
Last Sunday was memorable, as I had the opportunity to spend time with Mr. Tata.
We shared stories and insights about our mutual love for automobiles, our commitment to giving back to society, passion for wildlife conservation, and affection for our… pic.twitter.com/a9n1KU1CgC
— Sachin Tendulkar (@sachin_rt) May 21, 2024