NTV Telugu Site icon

MS Dhoni – Sachin: ఆ విషయంలో ధోనికి సిగ్గెక్కువంటున్న సచిన్..!

9

9

భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 17వ సీజన్ ఎట్టకేలకి మొదలైంది. శుక్రవారం మొదలైన ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా మొదటి మ్యాచ్ చపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగగా చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముస్తఫిజూర్ రెహమాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ తన తొలి కెప్టెన్సీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా మ్యాచ్ కు ముందు సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడుతున్న సమయంలో ఎంఎస్ ధోని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు సెలవులు! ఎప్పుడంటే..?

ఐపీఎల్ మ్యాచ్ మొదలు కావడానికి ముందు సచిన్ టెండూల్కర్ జియో సినిమాలో నిర్వహిస్తున్న డిస్కషన్ లో పాల్గొన్నారు. ఈ తరుణంలో ఎంఎస్ ధోని పై సచిన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోని తన తొలి రోజులో చాలా సిగ్గుపడేవాడని.., అతను తొలినాళ్లలో తనతో ఎక్కువగా మాట్లాడేవాడు అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు.

Also Read: Ration Rice Seized: మహారాష్ట్రకు భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలు పట్టివేత..!

ఇక కొన్నిసార్లు అయితే ధోని తన బోర్డింగ్ పాస్ ఇతర క్రికెటర్లకు ఇచ్చేవాడని., దాంతో ధోని తన పక్కన కూర్చోలేదంటూ సచిన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంపై సచిన్ టెండూల్కర్ కు చాలా మంది ఆడవాళ్లు చెప్పారంట. ధోని మీ పక్కన సీట్ పొందుతాడు కానీ., ఇతర ఆటగాళ్లకు అతని బోర్డింగ్ పాస్లు ఇచ్చి వేరే చోట కూర్చుంటాడు అంటూ చెప్పేవారట. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ధోని కెప్టెన్సీ నుండి వైదొలగడాన్ని భారత దిగ్గజ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ధోని నిర్ణయాన్ని సమర్థించాడు.

Show comments