కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఈరోజు జైపూర్‌లో తన సొంత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తన నిరసన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యతిరేక చర్యకు దిగొద్దని హైకమాండ్ హెచ్చరించినా.. కాంగ్రెస్ పెద్దల ఆదేశాలన్ని పైలట్ ధిక్కరించారు. అవినీతికి వ్యతిరేకంగా షహీద్ స్మారక్ స్థల్ వద్ద తన ఒకరోజు నిరాహార దీక్షకు కూర్చున్నాడు. బిజెపికి చెందిన మాజీ సీఎం వసుంధర రాజేపై వచ్చిన ఆరోపణలపై చర్య తీసుకోలేదని ఆరోపించిన సచిన్ పైలట్.. సొంత పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
Also Read:Bholaa Movie: భార్యతో కలిసి సినిమా చూశాడు.. డబ్బు ఖర్చు చేసిందని కొట్టాడు
గెహ్లాట్ ప్రభుత్వం పైలట్ తీరును ఖండించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. సచిన్ పైలట్ నిరాహారదీక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ హెచ్చరించింది. సచిన్ పైలట్ రోజు నిరాహార దీక్ష పార్టీ ప్రయోజనాలకు విరుద్ధం, పార్టీ వ్యతిరేక చర్య అని పార్టీ నాయకత్వం పేర్కొంది. తన సొంత ప్రభుత్వంతో ఏదైనా సమస్య ఉంటే మీడియా, పబ్లిక్‌లో కాకుండా పార్టీ ఫోరమ్‌లలో చర్చించవచ్చు అని కాంగ్రెస్ రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా తెలిపారు.
Also Read:Nirmala Sitharaman: భారత్ లో ముస్లింల జనాభా అధికం.. పాకిస్థాన్ కంటే మనమే టాప్
చాలా కాలంగా ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన పైలట్.. ప్రస్తుత ముఖ్యమంత్రి గెహ్లాట్ మధ్య విభేదాలను తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు సుఖ్‌జీందర్ సింగ్ రంధావా. తాను గత ఐదు నెలలుగా ఏఐసీసీ ఇన్‌చార్జిగా ఉన్నానని, పైలట్ తనతో ఈ అంశంపై ఎప్పుడూ చర్చించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆస్తి కాబట్టి ప్రశాంతంగా మాట్లాడాలని తాను ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని రంధావా అన్నారు.