Site icon NTV Telugu

Sabitha Indra Reddy : కేసీఆర్‌ మనకు శ్రీరామ రక్ష.. మన నాయకున్ని మనమే కాపాడుకోవాలి

Sabitha Indrareddy

Sabitha Indrareddy

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ లోని శ్రీ రాం కాలనీ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శ్రీరాంకాలనీ భారత మాత విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి ఆవిష్కరించి అక్కడి నుండి భారీ ర్యాలీగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గుజరాత్ రాష్ర్టంలో బీజేపీ ప్రభుత్వం 800 రూపాయల పెన్షన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో 2016 పెన్షన్ ఇస్తున్నామన్నారు.

Also Read : Khaleel Ahmed : చెప్పింది చేయకపోతే మా నాన్న బెల్టుతో చితక్కొట్టేవాడు..

మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ఏమిచేస్తున్నారని విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేసిఆర్ మనకు శ్రీరామ రక్ష మన నాయకున్నీ మనమే కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. రాష్ర్టా ప్రజలకు పథకాల రూపంలో అన్ని సౌకర్యాలు అందేలా చూస్తుమన్నారు. దళిత బంధు, కంటి వెలుగు, రైతు బంధు పెన్షన్ కేసిఆర్ కిట్ 24 గంటల కరెంట్ , లాంటి పథకాలు రాష్ర్టా ప్రజలకు అర్హులైన వారికి అందేలా చూస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌దే అని ఆమె అన్నారు. బీజేపీ మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై భారం వేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : Black Hole: సూపర్ మాసీవ్ “బ్లాక్ హోల్”.. సూర్యుడి కన్నా 33 బిలియన్ రెట్ల పరిమాణం..

Exit mobile version