NTV Telugu Site icon

Sabitha Indra Reddy : పారదర్శకంగా డబుల్‌ బెడ్‌ రూంల పంపిణీ

Sabitha

Sabitha

వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరికగా ఉండిందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అది నెరవేరింది… ఇప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజ్ రావడం చాలా సంతోషమన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవడం… చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు వచ్చినందుకు ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది 8 ప్రారంభించడం గొప్ప విషయంగా చెప్పుకున్నాం… కానీ ఇవ్వాళ 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం చరిత్ర సృష్టించినట్లు అయ్యిందని ఆమె వ్యాఖ్యానించారు.

పాలమూరు, రంగారెడ్డి ప్రజల కలను సాకారం చేస్తూ ఇంతపెద్ద ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నామని, కాళేశ్వరం ఏ పట్టుదల తో పూర్తి చేశారో… అదే స్ఫూర్తిగా పాలమూరు , రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్… పూర్తి చేసామన్నారు. సాగు నీరు, తాగు నీరు అందించే ప్రయత్నం లో విజయవంతం అయ్యామని, ఈ ప్రాంత బిడ్డగా కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. పాలమూరు జిల్లా వారు ఈ ప్రాంతానికి నీరు వస్తాయా అని అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రాజెక్ట్ పూర్తి చేసి రేపు ప్రారంభానికి సిద్ధంగా ఉందని, ఈ జిల్లా ప్రజలు, ముఖ్యమంత్రి కేసీఆర్ నీ ఎప్పటికీ మరవరన్నారు మంత్రి సబితా.

ఇవ్వాళ టెట్ పరీక్ష నిర్వహించాం… రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించామని, మరోవైపు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించుకోవాల్సి ఉందన్నారు. పేద వారికి… కులంతో, మతంతో సంబంధం లేకుండా ఇళ్ళ అలాట్మెంట్ చేస్తున్నాం..తాజాగా 13400 డబుల్ బెడ్ రూం లు రెండవ దశ లో అంటే 21న ఇవ్వబోతున్నాము. ఇవి 90 శాతం జీహెచ్‌ఎంసీలో దరకాస్తు చేసుకున్న వారికి లాటరీ పూర్తి చేసుకున్నామని, స్థానికంగా 10 శాతం అలాట్ చేయబోతున్నామన్నారు. ఇందులో తుక్కుగుడా మాంఖాల్ లో 2800 పై చిలుకు కట్టినవి…ఇప్పటికే 2230 ఇల్లు ఆలాట్ చేసాము… ఈ ఇళ్లన్నీ GHMC నిధులతో కట్టినవీ… స్థలం మాత్రం ఇక్కడ.. పారదర్శకంగా ఈ డ్రా తీసుకున్నాం…

మన దేశం లౌకిక దేశం… అందులో హైద్రాబాద్ అన్ని మతాల, కులాల సమాహారం… ఇక్కడ మిని ఇండియా నీ తలపిస్తుంది… అలాంటి సమయంలో ఎవరు డబల్ బెడ్ రూం కి దరఖాస్తు చేసుకుంటే వారికి అoదజేస్తున్నాము.. మలకపెట్, చార్మినార్, సరూర్ నగర్, యకత్పురా…. ఒక్కో దాంట్లో 500 ఇల్లు అనదజేయనున్నం… రెజర్వేషన్ ప్రకారం అందజేశాము… తుక్కుగూడా లో 1518 హిందువులకు ఇచ్చాము… ముస్లిం లకు ….. నా నియోజకవర్గం లో 470 మంది హిందువులకు కేటాయించాము… దీన్ని మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోడం కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు… కొంతమంది రాజకీయంగా ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.. స్థానికంగా ఉన్నవారికి 10 శాతం ఇస్తామని ముందుగానే ప్రకటించారు… మంఖాల్ లో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి ఒక్కొకరికి గృహలక్ష్మి కింద ఇంటి స్థలం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు… అందుకే వారికోసం స్థలం కేటాయించాము… డబుల్ బెడ్ రూం కావాల్సిన అందరూ MRO office కి రమ్మని పిలిచి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు… మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు నన్ను ప్రశ్నించే హక్కు ఉందని చెబుతున్నాను… రాబోయే రోజుల్లో 2nd ఫేస్ లో స్థానికులకు కూడా అలాట్ చేస్తాం.’ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.