Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sabitha Indra Reddy Fires On Congress 2

Sabitha Indra Reddy : నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయి..

Published Date :August 1, 2024 , 6:33 pm
By Gogikar Sai Krishna
  • ప్రజా పాలన.. ఇందిరమ్మ పాలన.. సోనియమ్మ నాయకత్వం.. అంటూ ఊదరగొడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి విమర్శ
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో మహిళల పాత్ర ఉందని వ్యాఖ్య
  • ఆడబిడ్డలకు మైక్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం..? అని ప్రశ్న
Sabitha Indra Reddy : నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన.. సోనియమ్మ నాయకత్వం.. అంటూ ఊదరగొడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో మహిళల పాత్ర ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు వణికిపోతున్నారన్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయని, అసెంబ్లీలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలం నాలుగున్నర గంటలు నిల్చుంటే మాకు మైక్ ఇవ్వలేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఆడబిడ్డలకు మైక్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం..? అని ఆమె ప్రశ్నించారు. సీఎం సీటులో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లాంటి నాయకులను చూశామని, మేము నిల్చుంటే కాంగ్రెస్ సభ్యుల కళ్ళల్లో రాక్షస ఆనందం కనిపించిందన్నారు.

అంతేకాకుండా..’కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రధాని మోడీ వద్దకు దళిత సోదరులను తీసుకువెళ్లారు.. ఒక్కసారి మాకు మైక్ అడిగినా స్పీకర్ ఇవ్వలేదు.. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డికి మైక్ ఇవ్వొద్దని స్పీకర్ తీర్మానం చేశారు.. ఆదివాసీ మహిళా ఎంఎల్ఏ కోవా లక్ష్మీ మైక్ అడిగినా స్పీకర్ ఇవ్వలేదు.. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వం. కనీసం స్పందించలడం లేదు.. ఏం మాట్లాడినా.. మమ్మల్ని.. డీమోరలైజ్ చేస్తున్నారు.. హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బతింటుంది.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మేము నిల్చుని ఉంటే ఎంజాయ్ చూసుకుంటూ కూర్చున్నారు.. ఒక్క సారి మమ్మల్ని కూర్చోమని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అనలేదు.. మహిళలకు గౌరవం ఇవ్వాలనే సోయి ప్రభుత్వానికి లేదు.. మాపైన సీఎం రేవంత్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నారు.. భట్టి ఏ మొహం పెట్టుకుని కూర్చున్నారని అన్నారు.. పార్టీ మారితే మేము చేసిన తప్పు అయితే అక్కడ పార్టీ మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా…?భట్టికి సీఎం అయ్యే అవకాశం ఉన్నా ఎందుకు కాలేకపోయారు.. నన్ను సీఎం చేయమని కాంగ్రెస్ పార్టీ పెద్దలను భట్టి అడగవచ్చు కదా…? సభలో లేని కవిత గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చా…? రేవంత్ రెడ్డి ద్వందనీతితో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి
ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి కాపాడాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తెలంగాణ భవన్ లో విడిచిపెట్టారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణలో నమ్మారు. మమ్మల్ని నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టేషన్ అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రేవంత్ రెడ్డి చేస్తారా…?’ అని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • sabitha indra reddy
  • telugu news

తాజావార్తలు

  • Iran War: భారత్‌కు వస్తున్న ఇరాన్ చమురు నౌక చైనాకు మళ్లింపు.. కారణం ఏమిటి..?

  • AP Weather Alert: అలర్ట్.. 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!

  • Bandla Janani: బండ్ల ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడితడే..

  • Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..

  • Haier Desert Rose AC: భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్-క్లీనింగ్ ఏసీ ప్రారంభం.. 10 సెకన్లలో చల్లని గాలి

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions