NTV Telugu Site icon

Sabitha Indra Reddy : నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయి..

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన.. సోనియమ్మ నాయకత్వం.. అంటూ ఊదరగొడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో మహిళల పాత్ర ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు వణికిపోతున్నారన్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయని, అసెంబ్లీలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలం నాలుగున్నర గంటలు నిల్చుంటే మాకు మైక్ ఇవ్వలేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఆడబిడ్డలకు మైక్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం..? అని ఆమె ప్రశ్నించారు. సీఎం సీటులో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లాంటి నాయకులను చూశామని, మేము నిల్చుంటే కాంగ్రెస్ సభ్యుల కళ్ళల్లో రాక్షస ఆనందం కనిపించిందన్నారు.

అంతేకాకుండా..’కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రధాని మోడీ వద్దకు దళిత సోదరులను తీసుకువెళ్లారు.. ఒక్కసారి మాకు మైక్ అడిగినా స్పీకర్ ఇవ్వలేదు.. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డికి మైక్ ఇవ్వొద్దని స్పీకర్ తీర్మానం చేశారు.. ఆదివాసీ మహిళా ఎంఎల్ఏ కోవా లక్ష్మీ మైక్ అడిగినా స్పీకర్ ఇవ్వలేదు.. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వం. కనీసం స్పందించలడం లేదు.. ఏం మాట్లాడినా.. మమ్మల్ని.. డీమోరలైజ్ చేస్తున్నారు.. హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బతింటుంది.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మేము నిల్చుని ఉంటే ఎంజాయ్ చూసుకుంటూ కూర్చున్నారు.. ఒక్క సారి మమ్మల్ని కూర్చోమని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అనలేదు.. మహిళలకు గౌరవం ఇవ్వాలనే సోయి ప్రభుత్వానికి లేదు.. మాపైన సీఎం రేవంత్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నారు.. భట్టి ఏ మొహం పెట్టుకుని కూర్చున్నారని అన్నారు.. పార్టీ మారితే మేము చేసిన తప్పు అయితే అక్కడ పార్టీ మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా…?భట్టికి సీఎం అయ్యే అవకాశం ఉన్నా ఎందుకు కాలేకపోయారు.. నన్ను సీఎం చేయమని కాంగ్రెస్ పార్టీ పెద్దలను భట్టి అడగవచ్చు కదా…? సభలో లేని కవిత గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చా…? రేవంత్ రెడ్డి ద్వందనీతితో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి
ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి కాపాడాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తెలంగాణ భవన్ లో విడిచిపెట్టారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణలో నమ్మారు. మమ్మల్ని నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టేషన్ అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రేవంత్ రెడ్డి చేస్తారా…?’ అని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.