తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా జరిగాయి. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలను విమర్శించారని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఆమె మండిపడ్డారు. భట్టి మాటలు బాధకరమని, భట్టి గారు మీ పక్క సీటు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. మేం ఏ తప్పు చేయలేదని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ మారారని మీకు అనే హక్కు లేదని, మేము పార్టీ మారలేదు.. పార్టీ నుంచి బయటకు మెడ పట్టి గెంటేశారని ఆమె అన్నారు. మా కుటుంబానికి ఓ చరిత్ర ఉందని, ఎన్టీఆర్ ను పక్కకు దించేసినప్పుడు ఇంద్రారెడ్డి… 2014లో టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీకి పనిచేశానన్నారు. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారని, మహిళలను మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారన్నారు సబితా ఇంద్రారెడ్డి.
US Beach video: టూరిస్టులపై మిడతల దండు దాడి.. తుఫాన్ మాదిరిగా బీభత్సం
అంతేకాకుండా.. మహిళలను కనీసం మాట్లాడనివ్వడం లేదు. ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదు.. నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన పదవి అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్నా… కమిట్ మెంట్ తో పనిచేశామని ఆమె అన్నారు. రాష్ట్ర మహిళలను అవమానించినట్లే అని ఆమె మండిపడ్డారు. అధికారంలో ఉన్నా లేకున్నా జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నామని, దొంగలే దొంగ అన్నట్లుగా ఉంది అని, డీకే అరుణ, సబితారెడ్డితో పాటు నన్ను అవమానించారని, కౌరవసభలో ద్రౌపదిలా మమ్మల్ని అవమానించారన్నారు. మేము సోదరుల మంచిని కోరుకునే వారమని ఆమె వ్యాఖ్యానించారు.