NTV Telugu Site icon

Sabitha Indra Reddy : ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉంటారు

Sabitha Indrareddy

Sabitha Indrareddy

కేసీఆర్‌ని ఇబ్బంది పెట్టే యోచనలోనే కవితకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉంటారని ఆమె స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రతి మహిళ ఖండిస్తోందని, సంస్కారం మరచి.. ఈర్శతో మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. మీ ఇంట్లో అమ్మ, భార్య ఉందని, రాజకీయ జీవితంలో జాగ్రత్తగా మాట్లాడాలని ఆమె హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్, కవితను తిట్టడం తప్ప బీజేపీనేతలు చేసేంది ఏమి లేదని ఆమె మండిపడ్డారు. దేశ అడబిడ్డల హక్కుల కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నా చేశారన్నారు.

Also Read : Iran-Saudi Arabia: బద్ధ శత్రువులు ఇరాన్, సౌదీల ఒకటవుతున్నారు.. మధ్యవర్తిత్వం వహించిన చైనా

మహిళా రిజర్వేషన్ కోసం కవిత ధర్నాకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. బీజేపీ పార్టీ మహిళా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట్లాడడం లేదన్నారు మంత్రి సబితా. రాష్ట్ర బీజేపీ నాయకులు ధర్నా చేసే హక్కు లేదని, సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని మంత్రి సబితా తెలిపారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు 50 శాతం మేర ఉన్నారన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ధర్నా చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. రిజర్వేషన్ లేకపోయినా మహిళను మేయర్‌ను చేసిన ఘనత కేసీఆర్‌ది అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ పాలించే రాష్ట్రాల్లో లేవని పేర్కొన్నారు సబితా ఇంద్రారెడ్డి.

Also Read : BRS Vs BJP: బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్.. నోటీసులు జారీ