Site icon NTV Telugu

Sabitha Indra Reddy : టీచర్లకు గుడ్‌న్యూస్‌.. 317 జీవోపై కీలక ప్రకటన

Sabitha Indrareddy

Sabitha Indrareddy

రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతులలో 317 జీఓ ద్వారా బదిలీ అయిన వారికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బ‌దిలీల‌కు సంబంధించి పూర్వపు జిల్లాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌కు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్‌ 317లో వేరే జిల్లాకు బ‌దిలీ అయిన ఉపాధ్యాయుల‌కు పూర్వ జిల్లా స‌ర్వీసును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఉపాధ్యాయ బ‌దిలీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం త‌న కార్యాల‌యంలో విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు.

Also Read : Today (07-02-23) Stock Market Roundup: మార్కెట్‌కి ‘‘మంగళ’’వారం కాదు

ఇప్పటికే ప్రారంభ‌మైన ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప‌దోన్న‌తుల ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 ఉంచి 14వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయులంద‌రికీ స‌మ‌న్యాయం చేకూర్చాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని పేర్కొన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇప్ప‌టికే వ‌చ్చిన 59 వేల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న పూర్తి చేయబడిందని ఆమె స్పష్టం చేశారు.

Also Read : Writer Padmabhushan: నిన్న మహేష్ నేడు రవితేజ.. ‘కలర్ ఫోటో’ హీరో దశ తిరిగినట్టే

Exit mobile version