Site icon NTV Telugu

Sabarmati Central Jail: హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్‌ను గుజరాత్‌ జైల్లో చితకబాదిన తోటి ఖైదీలు..

Syed Ahmed Mohiuddin

Syed Ahmed Mohiuddin

Sabarmati Central Jail: గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి కీలక వార్తలు వెలువడ్డాయి. రిసిన్ పాయిజన్‌తో ప్రజలను హత్య చేయడానికి కుట్ర పన్నిన హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను తోటి ఖైదీలు చితకబాదారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP)తో సంబంధం ఉన్న ఉగ్రవాది డాక్టర్ అహ్మద్‌పై జైలు లోపల దాడి జరిగింది. హై సెక్యూరిటీ సెల్‌లో బంధించినప్పటికీ ఇతర ఖైదీలు అకస్మాత్తుగా అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.

READ MORE: Astrology: నవంబర్‌ 19, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..!

దాడి సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, అతడి ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వర్గాలు తెలిపాయి. సెల్ వెలుపల ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లి డాక్టర్ అహ్మద్‌ను ఖైదీల బారి నుంచి రక్షించింది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుని, దాడి ఎందుకు జరిగిందని దర్యాప్తు ప్రారంభించింది. ఖైదీలు ఎందుకు ఆకస్మిక దాడికి పాల్పడ్డారో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

READ MORE: Donald Trump: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై అమెరికా నిఘా నివేదికను తప్పుబట్టిన ట్రంప్..

డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ఎవరు?
నవంబర్ 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతడు ఐసీస్‌కు చెందిన ఓ ప్రాంతీయ విభాగం.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్‌తో టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చైనాలో ఎంబీబీఎస్ చదవిని మొహియుద్దీన్ ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే విషాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ వీరిని విచారిస్తోంది. ఈక్రమంలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. మొహియుద్దీన్.. ఐఎస్‌కేపీకి చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్ ఆదేశాల మేరకు పని చేస్తుండేవాడని విచారణలో వెల్లడైంది. సదరు ఉగ్రవాది.. పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్‌ను నడిపిస్తున్నాడని.. అతడే మొహియుద్దీన్‌కు అవసరమైన సమాచారం కూడా అందించేవాడని తెలిసింది.

Exit mobile version