Site icon NTV Telugu

Road Accident: శబరిమల యాత్రికుల వాహనానికి ప్రమాదం.. హైదరాబాద్‌ వాసి మృతి..

Road Accident

Road Accident

Road Accident: శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల వాహనం కేరళలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన TGSPDCL ఉద్యోగి అశోక్ మృతి చెందారు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ప్రమాదం జనవరి 7 ఉదయం 5:30 గంటలకు మువత్తుపుళ్ – పెరుంబవూర్ MC రోడ్డులోని త్రిక్కలత్తూర్, కవుంపాడు వద్ద జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డవారిలో కొడుకు, అల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అల్లుడు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గాయపడినవారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించింది. సమాచారం అందుకున్న వెంటనే మువత్తుపుళ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదే ప్రాంతంలో నెల క్రితం అయ్యప్ప భక్తుల బస్సు మరియు లారీ ఢీకొన్న ఘటన జరిగింది. ఆ సమయంలో ఎవరికి గాయాలు కాలేదు. ప్రభుత్వం మరియు పోలీసులు ఈ ప్రమాదంపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: F&O Trading Loss: రూ.2.85 లక్షల జీతగాడు.. రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు! ఎలాగో చూడండి..

Exit mobile version