Sabarimala Ayyappa swami Darshanam: శబరిమల స్వామి దర్శనం సంబంధించి కేరళ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే శబరిమల అయ్యప్ప దర్శనానికి యాత్రికులను అనుమతించబోతున్నట్లు సమాచారం. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇందులో భాగంగా రోజుకు గరిష్టంగా 80 వేల మందిని దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వర్చువల్ క్యూ బుకింగ్ కూడా యాత్రికులు తమ మార్గాన్ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుందని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మకరవిళక్కు సీజన్‌లో భక్తుల మామూలుగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Jammu Kashmir: భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
ముఖ్యంగా అటవీ మార్గం గుండా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు ఎదురుకునే ప్రధాన సమస్యలలో ఒకటైన పార్కింగ్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్డు, దాని చుట్టూ ఉన్న పార్కింగ్ ప్రదేశానికి మరమ్మతులు చేసే పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన అతిథి గృహం నిర్మాణం పూర్తయిందని, త్వరలో మరొకటి పూర్తి చేస్తామని ప్రకటించారు.
Also Read: T20 World Cup 2024: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్‌కు చావోరేవో! రికార్డ్స్ ఇవే