అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ నవంబర్ 21న రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సాయిలు కంపాటి స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం స్వయంగా నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్ మంచి అంచనాలు తీసుకొచ్చింది. అయితే తాజాగా జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో సాయిలు చేసిన కామెంట్స్ మాత్రం టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారాయి.
Also Read : kaantha OTT : దుల్కర్–రానా నటించిన ‘కాంత’ ఓటీటీ రిలీజ్‌పై తాజా అప్డేట్
‘‘మా సినిమా చిన్నదైనా, దాని వెనక ఉన్న ఎమోషన్ చాలా పెద్దది. పల్లెటూరి కథలు, అమాయకమైన ప్రేమ, ఊర్లో జరిగే నిజ జీవిత సంఘటనలు నాకు తెలుసు. నేను విమానం నుంచి దిగి వచ్చే హీరోల కథలు రాయలేదు. మన దగ్గర జరిగిన నిజమైన కథను తీసుకొచ్చా. ఈ సినిమా 15 ఏళ్ల పాటు నరకం చూసిన ఒక జంట నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకున్నది’’ అని దర్శకుడు చెప్పారు. అలాగే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేయొద్దు, సినిమా నచ్చకపోతే వదిలేయండని అభిమానులకు కోరుతూ.. ‘‘మా టీమ్ ఎంత కష్టపడిందో మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. మన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది’’ అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేయొద్దని కోరుతూ.. ‘ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్ సెంటర్‌లో అర్ధనగ్నంగా తిరుగుతా!” అని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా టీమ్ కష్టాన్ని నమ్మి ఇలాంటి ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. సాయిలు కంపాటి స్టేట్‌మెంట్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సినిమాపైనే పడింది.