SA20 2026 Winners: సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2026 (SA20) సీజన్ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత థ్రిల్ అందించింది. లీగ్ అంతా ఉత్కంఠభరితంగా సాగగా.. ఆదివారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ మరింత ఉత్కంఠను రేపింది. ఈ ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape) జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్ (Pretoria Capitals)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది.
HYDRA DRF Rescue: అర్ధరాత్రి ఆపద.. తొమ్మిది మంది ప్రాణాలని కాపాడిన హైడ్రా DRF బృందం
న్యూల్యాండ్స్ (Newlands, Cape Town) వేదికగా జరిగిన ఫైనల్‌లో టాస్ గెలిచిన ప్రిటోరియా క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనా డెవాల్డ్ బ్రెవిస్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 56 బంతుల్లో 101 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 180కి పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేసి సన్‌రైజర్స్ బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టాడు. ఓక్లావైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా తనదైన బ్యాటింగ్ చేసి మరోసారి “బేబీ ఏబీ డివిలియర్స్” పేరు నిలబెట్టేలా సెంచరీ సాధించాడు. సన్‌రైజర్స్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ మెరిశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
That #BetwaySA20 Final winning moment 🔥#PCvSEC #WelcomeToIncredible pic.twitter.com/zHSL4p27v0
— Betway SA20 (@SA20_League) January 25, 2026
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు ఆరంభంలో చిన్న షాక్ తగిలింది. జానీ బెయిర్‌స్టో మొదటి ఓవర్లోనే ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత మాథ్యూ బ్రీట్జ్కే, కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బ్రీట్జ్కే 49 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ స్టబ్స్ 41 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివర్లో నాలుగు బంతులు మిగిలుండగానే స్టబ్స్ కొట్టిన సిక్సర్‌తో సన్‌రైజర్స్ విజయం ఖరారైంది.
Abhishek Sharma: గురువుకు తగ్గ శిష్యుడు.. యువరాజ్ సింగ్‌ను గుర్తు చేసిన అభి’సిక్స్’ శర్మ!
ఈ విజయంతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ SA20 చరిత్రలో మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పటికే 2023, 2024 సీజన్లలో ట్రోఫీ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, 2025 ఫైనల్‌లో ఓటమి పాలైనా.. 2026లో మళ్లీ గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.
