VVS Laxman: సూర్య సూపర్.. ఆ ఇద్దరికి ఎదురేలేదు: లక్ష్మణ్
- టీ20 సిరీస్ 3-1తో భారత్ సొంతం
- తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్
- చిరస్మరణీయ విజయానికి అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును అద్భుతంగా నడిపించాడని టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. సిరీస్ ఆసాంతం కుర్రాళ్లు ప్రదర్శించిన వ్యక్తిత్వం పట్ల తాను గర్వపడుతున్నా అని చెప్పారు. జట్టు ఆడిన తీరు, ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించిన విధానం అద్భుతం అని హైదరాబాద్ సొగసరి చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను 3-1తో భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉండడంతో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కోసం తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.
టీ20 సిరీస్ అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ఆసాంతం భారత కుర్రాళ్లు ప్రదర్శించిన వ్యక్తిత్వం పట్ల గర్వపడుతున్నా. 3-1తో విజయం ఓ ప్రత్యేక కృషి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును అద్భుతంగా నడిపించాడు. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మకు ఎదురేలేదు. బంతితో వరుణ్ చక్రవర్తి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. భారత జట్టు ఆడిన తీరు, ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించిన విధానం చూసి సంతోషంగా ఉంది. ఈ చిరస్మరణీయ విజయానికి అభినందనలు’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
Also Read
‘టీమిండియా ప్లేయర్స్ అదరగొట్టారు. అందరికీ నా అభినందనలు. విదేశాల్లో సిరీస్ గెలవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. గత పర్యటనలో సిరీస్‌ను 1-1తో ముగించాం. ఈ సారి సిరీస్ కైవసం చేసుకున్నాం. 2-1తో ఆధిక్యంలో ఉన్నా.. చివరి మ్యాచ్‌ను దూకుడుగానే ఆడాలనుకున్నాం. అందరూ రాణించడం సంతోషం. ఈ సక్సెస్ క్రెడిట్ అందరికీ దక్కుతుంది. సిరీస్‌ను జట్టుగా గెలుచుకున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నా. ఈ సిరీస్ నుంచి మేం పాఠాలూ నేర్చుకున్నాం. ఇక దేశవాళీ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్న అందరికీ అభినందనలు. నేనూ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడబోతున్నా’ అని సూర్యకుమార్ తెలిపాడు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!