NTV Telugu Site icon

Arshdeep Singh: తొలి పేసర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్‌ రికార్డు!

Arshdeep Singh Record

Arshdeep Singh Record

Arshdeep Singh 5 Wickets Record: టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి పేసర్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. జోహన్నస్‌బర్గ్‌ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (5/37) ఐదు వికెట్లు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు ముగ్గురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా.. వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. అర్ష్‌దీప్‌ ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేలలో ఇప్పటివరకూ ఇద్దరు బౌలర్లు ఐదు వికెట్లు తీశారు. 1999లో సునీల్‌ జోషి (5/6) ఐదు వికెట్స్ తీయగా.. 2018లో యుజ్వేంద్ర చహల్‌ (5/22)లు 5 వికెట్స్ పడగొట్టాడు. దక్షిణాఫ్రికాపై రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసినా.. అది వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలో పడగొట్టాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌. అంతకుముందు వెటరన్ పేసర్ ఇషాంత్‌ శర్మ 2013లో సెంచూరియన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 10 ఓవర్లు వేసి 4 వికెట్లు (4/40) పడగొట్టాడు.

Also Read: IND vs SA: టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్‌.. ఉన్నపలంగా స్వదేశానికి స్టార్ ప్లేయర్!

ఈ మ్యాచ్‌లో 116 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో దక్షిణాఫ్రికా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. భారత్‌పై దక్షిణాఫ్రికాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. అంతకుముందు వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 83 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. గతేడాది ఢిల్లీ వేదికగా జరిగిన వన్డేలో 99 పరుగులు చేసింది. జోహన్నస్‌బర్గ్‌ వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో 116 పరుగులకే ఆలౌట్‌ అయింది. తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Show comments