Site icon NTV Telugu

SA vs Ban: గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్

Sa Vs Ban

Sa Vs Ban

SA vs Ban: క్రికెట్ అంటే జెంటిల్‌మెన్స్ గేమ్ అని చెబుతారు. కానీ, అప్పుడప్పుడూ ఈ ఆటకు మచ్చ కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘోర సంఘటనే మే 28 (బుధవారం)న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఎమర్జింగ్ జట్ల మధ్య నాలుగు రోజుల అనధికారిక టెస్టులో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఒకరినొకరు గ్రౌండ్ లోనే తోసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. అసలు ఎందుకు ఇలా జరిగిందన్న విషయానికి వెళితే..

Read Also: COVID-19: మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?

ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 105వ ఓవర్ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆఫ్ స్పిన్నర్ త్సెపో న్టులి బౌలింగ్ చేస్తుండగా, బ్యాటర్ రిపాన్ మోండోల్ అతని మొదటి బంతిని సిక్సర్‌గా మిడ్ వికెట్ మీదుగా బాదాడు. దీంతో కోపానికి గురైన న్టులి, బ్యాటర్ వద్దకు వెళ్లి ఏదో అంటూ వాగ్వాదానికి దిగాడు. దాంతో రిపాన్ అతన్ని వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా కోపంతో ఉన్న న్టులి రిపాన్‌ను తోసి, అతని హెల్మెట్ గ్రిల్‌ను పట్టుకుని ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. గొడవ పెద్దవుతున్న సమయంలో అప్పటికే మధ్యలోకి వచ్చిన అంపైర్, దక్షిణాఫ్రికా ఫీల్డర్లు ఇద్దరినీ విడదీశారు.

Read Also: Off The Record : వాళ్ళ కోసమే తెలంగాణ కేబినెట్‌ విస్తరణ ఆగుతుందా..??

ఈ ఘటనపై మ్యాచ్ అధికారుల పరిశీలన ప్రారంభమైంది. ఇరు జట్ల ఆటగాళ్లపై ఐసీసీ ప్రోటోకాల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ప్రమాదకర ఘర్షణ తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైనప్పటికీ, మైదానంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో మళ్లీ ఒకసారి స్పోర్ట్స్‌మన్‌షిప్ ఎక్కడికీ పోయిందనే చర్చ మొదలైంది. క్రికెట్‌లో ఇదో మరిచిపోలేని చెత్త ఘట్టంగా నిలిచిపోనుంది.

Exit mobile version