NTV Telugu Site icon

SA vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. రెండు మార్పులతో ఆస్ట్రేలియా! భారత్‌ను ఢీకొట్టేది ఎవరో?

Sa Vs Aus Playing 11

Sa Vs Aus Playing 11

Shamsi, Jansen comes in for SA vs AUS 2nd Semi-Final: వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మరికొద్ది సేపట్లో రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌ల టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రొటీస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు బావుమా చెప్పాడు. ఎన్‌గిడి స్థానంలో షమ్సీ, ఫెహ్లుక్‌వాయో స్థానంలో జాన్‌సెన్ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా తరఫున స్టోయినిస్, అబాట్ స్థానాల్లో మాక్స్‌వెల్ మరియు స్టార్క్ జట్టులోకి వచ్చారు.

లీగ్‌ దశలో ఏడేసి విజయాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది. అయితే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈడెన్‌ గార్డెన్స్‌లో వర్షం లేనప్పటికీ.. మ్యాచ్ మొదలయ్యాక పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉన్నా.. ఆసీస్ క్రికెట్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న దక్షిణాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

తుది జట్లు:
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), టెంబా బవుమా (కెప్టెన్‌), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి.
ఆస్ట్రేలియా: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.