SA vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. రెండు మార్పులతో ఆస్ట్రేలియా! భారత్‌ను ఢీకొట్టేది ఎవరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamsi, Jansen comes in for SA vs AUS 2nd Semi-Final: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికొద్ది సేపట్లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌ల టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రొటీస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు బావుమా చెప్పాడు. ఎన్‌గిడి స్థానంలో షమ్సీ, ఫెహ్లుక్‌వాయో స్థానంలో జాన్‌సెన్ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా తరఫున స్టోయినిస్, అబాట్ స్థానాల్లో మాక్స్‌వెల్ మరియు స్టార్క్ జట్టులోకి వచ్చారు.
లీగ్ దశలో ఏడేసి విజయాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది. అయితే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం లేనప్పటికీ.. మ్యాచ్ మొదలయ్యాక పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నా.. ఆసీస్ క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్‌రేట్ ఉన్న దక్షిణాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకుంటుంది.
Also Read
తుది జట్లు:
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి.
ఆస్ట్రేలియా: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?