Sa Re Ga Ma Pa Season 16: ఫైనల్స్‌కు గెస్ట్‌లుగా నాగచైతన్య, సాయిపల్లవి.. టైటిల్ గెలుచుకునేది ఎవరు?
- సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలే
- ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీతెలుగులో
- ముఖ్యఅతిథులుగా నాగచైతన్య, సాయిపల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీతెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి మనసుని హత్తుకునే పాటలు,అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీతెలుగు పాపులర్ షో సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో కొనసాగుతున్నసరిగమప 16 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి ముఖ్య అతిథులుగా ఉత్కంఠగా సాగిన సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలే, ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీజీతెలుగులో!
ఈ సీజన్ కు ప్రముఖ యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, గాయని ఎస్పీ శైలజ, పాటల రచయిత కాసర్ల శ్యామ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో ఎంపికైన గాయనీగాయకులు విలేజ్ వోకల్స్, సిటీ క్లాసిక్స్, మెట్రో మెలొడీస్ మూడు జట్లుగా పోటీపడ్డారు. ఈ జట్లకు ప్రముఖ గాయకులు రేవంత్, రమ్య బెహర, అనుదీప్ దేవ్ మెంటర్లుగా వ్యవహరించారు. మెంటర్స్ మార్గదర్శకత్వంలో సోలో, డ్యూయెట్, గ్రూప్ యాక్ట్స్ వంటి క్లిష్టమైన రౌండ్లను ఎదుర్కొని ఆరుగురు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు.
Also Read
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ఆరంభం నుంచీ అద్భుతమైన ప్రదర్శనలతో రాణిస్తున్న సాత్విక్, మేఘన, వైష్ణవి, మోహన్, అభిజ్ఞ, మానస ఫినాలేకు చేరుకుని టైటిల్ బరిలో నిలిచారు. ఈ ఆరుగురు సరిగమప 16-ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ టైటిల్ కోసం పోటీపడనున్నారు.ఉత్కంఠగా సాగనున్న ఈ గ్రాండ్ ఫినాలేకు తండేల్ చిత్ర బృందం నుంచి హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతేకాదు సీనియర్ నటి రాధ, హీరో విశ్వక్ సేన్ ఈ ఫినాలే ఎపిసోడ్కి హాజరై ఫైనలిస్ట్ల్లో ఉత్సాహం నింపారు. ప్రముఖ గాయని మంగ్లీ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వగా, సీరియల్ నటులు నిసర్గ గౌడ, ప్రీతి శర్మ, అభినవ్, సంగీత, పృథ్వీ, సాయికిరణ్ హాజరై ఫైనలిస్టులకు తమ మద్దతు తెలిపారు.
రసవత్తరంగా సాగే ఈ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులు పలు మ్యూజికల్ రౌండ్లలో పోటీపడి ప్రేక్షకులను అలరిస్తారు. ఈ గ్రాండ్ ఫినాలేలో గెలిచిన కంటెస్టెంట్ సరిగమప 16-ది నెక్ట్స్సింగింగ్ యూత్ ఐకాన్ టైటిల్తోపాటు పదిలక్షల నగదుని కూడా గెలుచుకోనున్నారు. హోరాహోరీగా సాగే ఈ సంగీత సమరంలో నిలిచి గెలిచేదెవరో తెలుసుకోవాలంటే తప్పకుండా చూడండి సరిగమప 16-ది నెక్ట్స్సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ ఫినాలే మీ జీ తెలుగులో మాత్రమే!
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?