NTV Telugu Site icon

Minister Savitha: వారానికి ఒక రోజు కాటన్ వస్త్రాలు ధరించండి.. ప్రజలకు మంత్రి విజ్ఞప్తి

Minister Savitha

Minister Savitha

Minister Savitha: ప్రతి ఒక్కరూ వారాని ఒక రోజు కాటన్ వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు.. మంత్రి సవిత.. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన మొదటి సంతకం, ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన రెండవ సంతకం చేశారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు నాకు కల్పించారు. బీసీలకోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాకే బిసీలకు సంక్షేమం ప్రారంభమైంది. గతంలో కూర్చోడానికి కుర్చి లేని పరిస్థితిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు.. 32 ఉండే బీసీ రెసిడెన్సియల్ స్కూల్స్ ను చంద్రబాబు 106 కు పెంచరన్న ఆమె.. జగన్ పాలనలో కేవలం రెండు బీసీ రెసిడెన్సియల్ కాలేజీలు మాత్రమే తెచ్చారని విమర్శించారు.

Read Also: Airtel New Plan 2024: ఎయిర్‌టెల్‌లో కొత్త ప్లాన్‌.. తక్కువ ధరతో ఎక్కువ వ్యాలిడిటీ!

ఇక, చంద్రబాబు పాలనలో 2,173 మందికి ఎన్టీఆర్ విదేశీ విద్య అందిస్తే.. జగన్ కేవలం 89 మందికి మాత్రమే విదేశీ విద్య అందించారని తెలిపారు మంత్రి సవిత.. ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ లు, బీసీ భవన్ లను ఏర్పాటు చేయబోతున్నాం అని వెల్లడించారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాతో పాటు ఉద్యమాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.. ఇక, హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్సైటైల్స్ రంగాన్ని జగన్ పాలనలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ప్రతి ఒక్కరూ వారాని ఒక రోజు కాటన్ వస్త్రాలు ధరించాలని.. తద్వారా ఆ రంగాలను ప్రోత్సహంచాలని కోరారు మంత్రి సవిత.