NTV Telugu Site icon

S. S. Rajamouli Bday Special : ఓటమి ఎరుగని ధీరునికి ‘ఆస్కార్ సెల్యూట్’

Ssr

Ssr

కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళిగా అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు తెలియని సినీపేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు వాడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు. తెలుగు సినిమాను ఎవరు చూస్తారు అనే స్థాయి నుండి తెలుగు సినిమా వస్తోంది ఎగబడి చూడాలి అనే స్థాయికి తీసుకువెళ్లిన బహుముఖ ప్రజ్ఞాశాలి SS రాజమౌళి.

కుటుంబ నేపథ్యం :
తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ రచన చేసారు. ఇక రాజమౌళికి 2001లో రమ రాజమౌళిని వివాహం చేసుకున్నాడు. రాజమౌళి ప్రతి సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యహరిస్తారు. రాజమౌళి గురించి రెండు ముక్కల్లో రమా రాజమౌళిని చెప్పమంటే పని రాక్షసుడు అంటూ ప్రేమగా బదులిస్తారు. కొడుకు కార్తికేయ రాజమౌళి సినెమాలకు అన్ని తానై వ్యవహరిస్తారు. ఆస్కార్ విజేత MM. కీరవాణి రాజమౌళికి పెదనాన్న అవుతారు.

సినీ జీవితం :

మొదట్లో తన గురువు రాఘవేంద్ర రావ్ దగ్గర శిష్యరికం చేస్తూ అయన నిర్మాణంలో శాంతినివాసం అనే సీరియల్ కు దర్శకత్వం వహించాడు. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో సినీ రంగ ప్రవేశం చేసాడు. అలా జూనియర్ ఎన్టీయార్ హీరోగా స్టూడెంట్ నం. 1 చిత్రంతో వెండితెరపై తొలిసారిగా రాజమౌళి పేరు పడింది. కానీ ఆ రోజు ఎవరు ఊహించలేదు ఆ పేరు రానున్న రోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని. ఆ పేరు గల స్టాంప్ పడితే ఆ సినిమా తిరుగులేని విజయం సాదిస్తుందని. రెండవ సినిమా సింహాద్రితో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. విక్రమార్కుడు, మగధీర, ఈగా, సై, యమదొంగ, మర్యాద రామన్న ఇలా వరుస హిట్స్ తో తెలుగు సినిమా చరిత్రలో ఇంత వరకు ఏ  దర్శకుడు అందుకొని రికార్డు సాధించాడు రాజమౌళి. ఇక బాహుబలి సిరీస్ తో రాజమౌళి పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోయింది. RRR సినిమాతో కళామతల్లి  ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లారు.

ప్రత్యేకత :

తాను అనుకున్న విజన్ ను స్క్రీన్ పై కనిపించాలని ముందుగా రాజమౌళి నటించి చూపించి నటీనటుల నుండి ఆ ప్రతిభను బయటకు తీయడం ఆయన స్పెషల్. ప్రతీ సీన్ ని అద్భుతమైన విజన్ తో హై స్టాండర్డ్స్ తో విజువల్ గా తెరకెక్కిస్తారు రాజమౌళి. ఈగ, యమదొంగ, మగధీర, బాహుబలి రాజమౌళిలోని దర్శకత్వ పటిమకు నిదర్శనాలు. కృషుడి సాయంతో అర్జునుడు యుద్ధం గెలిచినట్టు తండ్రి విజయేంద్రప్రసాద్ రచనలతో సిల్వర్ స్క్రీన్ పై రాజామౌళి అద్భుత సృష్టించి గొప్ప గొప్ప విజయాలు సాధించారు దర్శక ధీరుడు.

నంది టూ ఆస్కార్ : 

బెస్ట్ డైరెక్టర్ గా రాష్ట్రప్రభుత్వం అందించే నంది అవార్డు నుండి ప్రపంచ ప్రఖ్యాతి ఆస్కార్ అవార్డు వరకు ఇలా రాజమౌళి సినిమా ముద్దాడని అవార్డు లేదు. 1970 ఆక్టోబరు 10న జన్మించిన రాజమౌళి రానున్న రోజుల్లో మరెన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి, మరెన్నో పేరు ప్రఖ్యాతలు సాధించాలని మనసారా కోరుకుంటూ ఓటమి ఎరుగని ‘కళామతల్లి లాలీపోసి పెంచిన ముద్దు బిడ్డ’ SS రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Show comments