లెజెండరీ సింగర్ ఎస్. జానకి గారి ఏకైక కుమారుడు మురళీ కృష్ణ (65) మరణించారు. ఈ విషాద వార్తను ప్రముఖ గాయని చిత్ర సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మురళీ కృష్ణ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చిత్ర ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. మురళీ కృష్ణకు భార్య ఉమా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Also Read : ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో సూపర్ ‘హిట్’ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి
మురళీ కృష్ణకు కేవలం జానకి కుమారుడిగానే కాకుండా, కళాకారుడిగా కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన భరతనాట్యంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. అంతేకాకుండా, కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా కనిపించి అలరించారు. జానకి గారు గత కొన్నేళ్లుగా పాటలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమెను మురళీ కృష్ణ ఎంతో అపురూపంగా చూసుకునేవారు. ఇప్పుడు కంటికి రెప్పలా చూసుకునే కొడుకు దూరమవడంతో జానకి గారి కుటుంబంలో తీరని లోటు ఏర్పడింది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు జానకి గారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
