Site icon NTV Telugu

S. Jaishankar: తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ కీలక భేటీ.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు

Jaishankar

Jaishankar

S. Jaishankar: భారతదేశం-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను బలపర్చుకుంటుంది. ఈ సందర్భంగా ఆఫ్ఘన్ లోని తాలిబన్‌ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్‌ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని ఎరివేసేందుకు ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తాయని ప్రకటించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సీమాంతర ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న కొన్ని దేశాలకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Rajamouli : బాహుబ‌లి మాయాజాలం వెనుక రాజ‌మౌళి కృషి.. జక్కన్న స్పెషల్ బ‌ర్త్‌డే వీడియో!

ఇక, ఎక్సలెన్సీ, వృద్ధి, శ్రేయస్సు పట్ల మాకు ఉమ్మడి నిబద్ధత ఉంది అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అయితే, మన రెండు దేశాలు ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదం యొక్క ఉమ్మడి ముప్పు వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ఉగ్రవాదాన్ని అన్ని అంతం చేయడంతో పాటు టెర్రర్ కార్యకలపాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనం నిరంతరం సిద్ధంగా ఉండేందుకు సమన్వయం చేసుకోవాలి అని కోరారు. భారతదేశ భద్రతా సమస్యల పట్ల మీ సున్నితత్వాన్ని, మీ సంఘీభావాన్ని మేము అభినందిస్తున్నామని కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.

Read Also: AP Liquor Scam Case: సుప్రీంకోర్టులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ఊరట.. ఏపీ సర్కార్‌కు నోటీసులు

అలాగే, ఆఫ్ఘనిస్తాన్ స్థిరత్వానికి భారతదేశం దీర్ఘకాలంగా మద్దతు ఇస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతో పాటు స్వాతంత్ర్యానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం మీ జాతీయ అభివృద్ధికి, అలాగే ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుంది. కాబూల్‌లోని భారతదేశ సాంకేతిక మిషన్‌ను భారత రాయబార కార్యాలయ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను అని జైశంకర్ ప్రకటించారు.

Exit mobile version